Home / Entertainment / శౌర్య ఫస్ట్ లుక్ రిలీజ్

శౌర్య ఫస్ట్ లుక్ రిలీజ్

Author:

Showrya2

నటుడిగా తనకు తాను నిరూపించుకో గలిగినా కథల ఎంపిక లో కాస్త తడబడి సరైన హిట్ కి దూరంగా ఉన్న టాలీవుడ్ వర్తబుల్ నటుల్లో మంచుమనోజ్ ఒకడు. మనోజ్ తాను చేసే పాత్ర కోసం వందశాతం కష్టపడతాడు అనటం లో ఏమాత్రం సందేహం లేదంటారు ప్రేక్షకులూ, ఇండస్ట్రీ పెద్దలూ.. ఐతే కొంతకాలం గా ఒక సరైన హిట్ మనోజ్ కి దూరంగానే ఉంటూ ఊరిస్తోంది. మంచి పాత్ర అనుకుంటే చాలు ఆపాత్రలో కి వెళ్ళిపోయే మనోజ్ నటన లో ఎంత డెడికేటేడ్ గా ఉంటాడో “ప్రయాణం” “నేను మీకు తెలుసా” వంటి సినిమాలు చాలు. అయినా మనోజ్ కి సరైన హిట్ లేకపోవటం తో డల్ గ మాత్రం లేడు రాం గోపాల్ వర్మతో చేస్తున్న అట్టాక్ లో మనోజ్ ఇదివరకెన్నడూ కనిపించనంత డిఫరెంత్ ఉక్ తో కనిపించనున్నాడు. అంటే కాదు సోలో గా రాబోతున్న శౌర్య లో ఇంకా యంగ్ బోయ్ లుక్ తో అందంగా కనిపిస్తున్నాడు కూడా.. మనోజ్ హీరోగా కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దశరథ్ ఓ సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శౌర్య అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌నులో మనోజ్ ని చూసి అంతా అవాక్కయ్యారు. క్యూట్ లుక్ తో కనిపిస్తున్న మనోజ్ ఈ సిన్మాలో మునుపెన్నడూ లేనివిధంగా మనోజ్ ఫార్మల్ షూట్‌లో‌గా దర్శమిస్తుండటం విశేషం.

Showrya

 

ఈ ఫస్ట్‌లుక్‌ని బట్టి దర్శకుడు దశరథ్ తనశైలిలో అందమైన ప్రేమకథ చెబుతూనే మనోజ్ సినిమాల్లోని యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.ఐతే ప్రతీ సారీ మనోజ్ యాక్టింగ్ మాత్రమే సినిమాని గెలిపించలేదు,కథా కథనం మనోజ్ ని అతని బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే విధంగా చూపే దర్షకుడు, ఇలా అన్నీ కుదరాలి. ఐతే దశరథ్ పాత ట్రాక్ ని బట్టి చూస్తే మనోజ్ కి సరైన సక్సెస్ ఇచ్చే లాగానే అనిపిస్తోంది.ఈ సినిమాలో మంచు మ‌నోజ్ స‌ర‌స‌న తొలిసారిగా క‌థానాయిక‌గా రెజీనా న‌టిస్తోంది. రీసెంట్‌గా వ‌ర‌స విజ‌యాల‌తో దూకుడు మీదున్న రెజీనా లక్ తమకూ ఒక ప్లస్ ఔతుందనే భావిస్తున్నట్టున్నారు హీరో మనోజ్‌, ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌ధ్‌. ఈ ఇద్ద‌రికీ ఇప్పుడు హిట్ కంప‌ల్స‌రీ. ఈ ఇయ‌ర్ ఎండింగ్‌లో విడుద‌ల‌కు రెడీ అవుతోంది మ‌నోజ్ శౌర్య‌. ఈసారైనా ఫైట్ లూ బాడీ షో లూ మాత్రమే కాకుండా కథ ఏమిటీ అన్నదానిమీద దృష్టి పెడితే సక్సెస్ ఖాయమనే అంటున్నారు. సినిమా జనాలూ, మంచు అభిమానులూ.

(Visited 50 times, 6 visits today)