Home / Inspiring Stories / మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే భారత దేశం లోని అంతుచిక్కని రహస్యాలు.

మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే భారత దేశం లోని అంతుచిక్కని రహస్యాలు.

Author:

కొన్ని లక్షల సంవత్సరాలుగా మనిషి తనను ఒకప్పుడు అద్బుత శక్తులు అని నమ్మిన వాటినన్నిటినీ తెలుసుకుంటూ తానే వాటిపై ఆధిపత్యం సాధిస్తూ వచ్చాడు. తన పుట్టుక నుంచీ ఉన్న ప్రకృతి మీదే తాను పట్టు సాధించాడు. అతీత శక్తులంటూ ఏమీ లేవని నిరూపించి తానే అన్నిటి కంటే అధికున్నని నిరూపించుకోవాలనుకున్న ప్రతీసారీ ఎక్కడో ఒక సవాల్ మనిషిని వెక్కిరిస్తూనే ఉంది. ఇప్పటికీ సమధానాలు దొరకని మిస్టరీలెన్నొ ఈ ప్రపంచంలో ఇప్పటికే ఉండగా… మనిషి కోసం మరికొన్ని సవాళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నాయి… మన దేశంలో ఇప్పటికీ పరిష్కరించలేని మిస్టరీల మీద ఒక లుక్….

కవల పిల్లల ఊరు “కొడివి”:

Twins Village Kerala

ఆ గ్రామం కవల పిల్లల కారణంగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. రెండు వేల కుటుంబాలు నివసించే ఆ చిన్న ఊరిలో 400 జతల కవలలు ఉన్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. ఆ గ్రామం కేరళలోని మలప్పురం జిల్లాలో ఉంది. పేరు ‘కొడివి’. ఎక్కడైనా వెయ్యి జననాల్లో ఆరు కవల జననాలు ఉండటం సహజం. కానీ ఈ గ్రామంలో మాత్రం ప్రతి 1000 జననాలకు 45 కవలలు ఉంటున్నారు. సున్నీ ముస్లింలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు. మరో విశేషం ఏమంటే.. ఇక్కడి మహిళలకు పెళ్లిళ్లై సుదూర ప్రాంతాలకు వెళ్లినా వారికి కూడా కవలలు పుడుతున్నారు. ఇటీవలి కాలంలో వీటి సంఖ్య మరింత పెరిగింది. ఇక్కడ పదేళ్లలోపు పిల్లల్లో 80 జతల కవలలు ఉన్నారు. ఎన్నో పరిశొధనలు చేసినా కేవలం ఈ ఊరిలో మాత్రమే ఇలా కవలు ఎందుకు పుడుతున్నారన్నది మాత్రం మిస్టరీ గానే మిగిలిపోయింది…

ప్రేమ చిహ్నమా..? దేవాలయమా?:

taj-mahal
తాజ్ మహల్ అజారామర ప్రేమకు చిహ్నం,ముంతాజ్ మరణానికి షాజహాన్ నిర్మించిన ఒక మహా ఙ్ఞాపక కళాకండం. ప్రేమకు ఒక గుర్తు తాజ్ మహల్… ఇదే కదా మామూలుగా మనకు తెలిసిన విశయం… అయితే అది నిజం కాదంటున్నాడు ఢిల్లికి చెందిన ఫ్రొఫెసర్ పీ.ఎన్.ఓక్. తాజ్ మహల్ కు ముందు అది ఒక శివాలయం అట అక్కడ ఉన్న ఆలయాన్నే పాలరాతి కట్టడంగా పునర్ణిర్మించి దాన్ని ఇప్పటి తాజ్ మహల్ గా మారచారు అని ఆయన వాదన. ఆ విశయం ఇంకా ఏటూ తేలలేదు ఎందుకంటే రెండు పక్షాల సాక్ష్యాలూ సమానంగానే ఉన్నాయి… ఇప్పటికీ తాజమహల్ వివాదం లో నిజమేమిటన్నది మిస్టరీగానే ఉండిపోయింది.

శాపగ్రస్త గ్రామం:

Kuldhara

శాపం కారణం గా ఒక ఊరు ఊరే ఖాళీ అయిపోయింది.అదీ ఒకే ఒక రాత్రిలో … రాజస్థాన్ లోని కుల్ధారా అనే ఈ గ్రామం లో వంద సంవత్సారాలకు పైగా గడిచినా ఇప్పటికీ ఉండటానికి ఎవరూ సాహసించటం లేదు. అలా ప్రయత్నించిన వారందరికీ ధారుణమైన అనుభవాలు కలిగయట. నిజంగానే ఆ ఊరికి శాపం తగిలిదా,లేక గ్రామస్తుల మూఢనమ్మకమేనా అన్నది ఇప్పటికీ తేలలేదు…. అసలు రహస్యం…రహస్యంగానే ఉండిపోయింది.

కాంగ్క లా పాస్ గ్రహాంతర వాసుల విడిది:

kongka-la-pass-ufo-1

అక్కడ కొన్ని సార్లు రాత్రి పూట ఉన్నట్టుండీ ఆకాశం లోంచి రంగురంగుల లైట్లు వెలుగుతూ కొన్ని వస్తువులు కనిపిస్తాయి.అవి భూమివైపు దూసుకు వచ్చి మంచు కొండల మధ్య అదృశ్యమౌతాయి. పొద్దున్న చూస్తే అవి దిగినట్టుగా భావించే స్థలం లో ఏదొ బరువైన గుండ్రని వాహనం దిగిన గుర్తులూ కనిపిస్తాయి.ఇండో చైనా బోర్డర్ లో ఉండే కాంగ్కలా పాస్ ని గ్రహాంతర వాసుల విడిది అని పిలుస్తారు స్థానికులు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ప్రభుత్వం మాత్రం పట్టించుకోనట్టే వ్యవహరిస్తోంది… దీని వెనక ఉన్న మిస్టరీ ఏమిటో ఎవరికీ అంతుబట్టటం లేదు…

పునర్జన్మ నెత్తిన మహిళ శాంతిదేవి:

Shanta

నా ఊరు ఇది కాదు మా ఊరు మథుర అక్కడ నా భర్తా పిల్లలూ ఉన్నారు నన్ను అక్కడికి తీసుకు వెళ్ళండి అంటూ ఆ నాలుగేళ్ళ పాప ఏడుస్తూంటే కుటుంబసభ్యులంతా విస్తుపోయారు.. కానీ ఆమె చెప్పే వివరాలన్నీ పక్కగా ఉండటం తో మథుర వెళ్ళి చూస్తే,శాంతి దేవి చెప్పిన అక్షరం అక్షరం నిజం,ఆమె చెప్పిన ఇంటి గుర్తులూ,భర్త అని చెప్పిన వ్యక్తి పోలికలూ,ఆమె పిల్లల పేర్లూ,ఆ పరిసరాలూ ఆన్నీ అన్నీ సరిగ్గా సరిపోయాయ్. గుజరాత్ లోని ఎక్కడో మారు మూల పల్లె లో ఉన్న నాలుగేళ్ళ పసి పాపకి ఈ వివరాలన్నీ ఎలా తెలిసాయి? అమంటే పునర్జన్మలు నిజమేనా? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు…

నేతాజీ మరణం:

Netaji

ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడూ,భార్త దేశ విముక్తి పోరాట వీరుడూ అయిన నేతాజీ 1945 లోనే ఒక విమాన ప్రమాదం లో చనిపోయారని అందరూ విన్నదే,కానీ ఆయనని రశ్యన్ నియంత స్టాలిన్ చంపాడూ అనే ఒక కథ కూడా ప్రచారం లో ఉందేది,కొన్నాళ్ళకి ఆయన్ మనదేశం లోనే అఙ్ఞాతంగా ఉంటూ ఒక బాబాగా జీవించి 1985 లో చనిపోయారు అనే వాదన కూడా ఒకటుంది అయితే దీనిలో ఏదినిజం అన్నది ఇప్పటికీ అంతుపట్టని రహస్యమే….

బుల్లెట్ బాబా దేవుడికి గుడి కడతారు:

bullet_baba

దేవుడిలా భావించిన మనషులకి గుడి కట్టడం విన్నాం. కానీ ఓ బైక్ కి గుడి ఉండటం ఒక వింత కాగా ఆ బైక్ నే బాబా గా భావించటం మరో వింత. చోఠియాలా గ్రామానికి చెందిన ఓమ్ బన్నా అనే వ్యక్తి ఓ బుల్లెట్ బైక్ కొన్నాడు. ఓ రోజు ఆ బైక్ మీద బాంగ్దీ అనే ఊరివైపుగా ప్రయాణిస్తున్నాడు. అంతలో ప్రమాదవశాత్తు అతని బైక్ అదుపు తప్పింది, అంతే! అక్కడే ఉన్న చెట్టుని గుద్దేసింది. బన్నా స్పాట్ లోనే ప్రాణాలొదిలాడు. స్ధానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ అనంతరం బన్నాను కుటుంబ సభ్యులకు అప్పగించి.. బైక్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.అయితే పోలీస్ స్టేషన్ లో గొలుసులు వేసి మరి పార్క్ చేసిన బుల్లెట్ బైక్ మర్నాడు ఎక్కడైతే ప్రమాదం జరిగి బన్నా మరణించాడో అక్కడ ప్రత్యక్షమైంది.అలా ఒక్క సారి కాదు ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్ లో ఉంచినా,పెట్రోల్ లేకున్నా బైక్ మాత్రం తెల్లారేసరికి ఆ ప్రమాదం అయిన ప్రదెశంలోనే కనిపించేది… అదెలా జరిగింది అన్నది మాత్రం అప్పుడే కాదు ఇప్పటికీ మిస్టరీ నే….

70 ఏళ్ళుగా ఆహారమే ముట్టని మనిషి:

Prahlad-Jani-70-years-no-food-or-water

ఇప్పటివరకూ ప్రపంచానికే ఒక మిస్టరీ గా ఉన్న మనిషి మనదేశం లోనే ఉన్నాడు. ఆయన పేరు ప్రహ్లాద్ జైన్… మాతాజీ గా ప్రసిద్దుడైన ఆయన దాదాపు 70 సంవత్సరాలకు పైగా ఆహారం ముట్టుకోకుండానే పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నోరకాలుగా పరీక్షించారు. రోజులతరబడి ఆయనను ఒక గదిలో ఉంచి చూసారు అయినా ఆయన అంతే ఆరొగ్యంగా ఉన్న్నారు. ఆయన శరీరం ఆహారమే లేకుండా ఎలా తట్టుకుని ఉంటోందో మనదేసమే కాదు ప్రపంచం లోని ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా సమాధానం చెప్పలేక పోయారు… ఇప్పటికీ అది చేదించ బడని రహస్యమే…

పక్షుల ఆత్మహత్యల గ్రామం:

Assam

అస్సాం లోని ఒక పల్లెటూరిలో ప్రతీ సంవత్సరం వేసవి కాలం ఆరంభంలో మొదటి రెండు మూడు రోజుల్లో వందల కొద్దీ పక్షులు సాయంత్రాలు అక్కడికి చేరుకుంటాయి. వాటికవే గాయ పరచుకొని మరణిస్తాయి. ఏచెట్టుకో కొట్టుకోవటమో.ఆకాశం నుంచి వేగంగా వచ్చి నేలని ఢీ కోట్టట్టమో చేసి అక్కడే మరణిస్తాయి. ఆ మూడు రోజుల్లోనే ఎందుకు? కేవలం అస్సాం లోనే ఎందుకు అనే ప్రశలకు ఇప్పటికీ సమాధానమే లేదు…

వేలాడే రాతి స్తంబం:

lepakshi-temple-hanging-pillar-21[6]

ఇదెక్కడో కాదు ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయం లోనే. పైకప్పుని మోయాల్సిన స్తంభాల్లో ఒక స్తంభం మాత్రం పైకప్పునే ఆసరా చేసుకొని భూమికి కొన్ని మిల్లీ మీటర్ల ఎత్తులో గాలిలో వేలాడుతూ ఉంది. అదెలా అన్నది వందల సంవత్సరాలుగా ఇప్పటి వరకూ ఎవరూ కనుక్కోలేకపోయారు… అదై అలా అంతుచిక్కని రహస్యం గానే ఉండిపోయింది…

ఇవిమాత్రమే కాదు…. హిమాలయాల్లో కనిపిస్తాడనే జెయింట్ మానవాకారం  లాంటి మరికొన్ని ప్రశ్నలు ఇప్పటికీ కొన్ని వందల ఏళ్ళుగా అలా ఎవరూ పరిష్కరించ లేని మిస్టరీలు గానే మిగిలిపోయాయి. ఇవి ఎప్పటికైనా చేదించబడతాయా అంటే… సమాధానం అనుమానమే…

(Visited 8,819 times, 146 visits today)