నగదు లావాదేవీ రూ.2 లక్షలు దాటితే 100 % జరిమానా…!

Author:

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత నగదు లావాదేవీలు నిర్వహిస్తే 100 % జరిమానా విధిస్తామని మరో సంచలన నిర్ణయాన్ని అప్పట్లొనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నల్ల ధనం పెరగడంలో నగదు లావాదేవీలే ఎక్కువ పాత్ర పోషిస్తుండటంతో నగదు లావాదేవిలని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది,ఇప్పుడు అది ఆచరణలో పెట్టడానికి రెడీ అయ్యింది. ఇక మీదట రూ. 2 లక్షల పైన జరిగే నగదు లావాదేవీల పై 100 % జరిమానని విధించనున్నట్లు ప్రకటించింది, అంతే కాకుండా నగదు లావాదేవీలు జరిపే వారు మీకు తెలిస్తే  [email protected] ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరింది.

100%-Penalty for cash transactions

2017-18 కేంద్ర బడ్జెట్ లో మొదట రూ.3 లక్షల పైన ఆర్థిక లావాదేవీలు చేస్తే 100% జరిమానా విధిస్తామని ప్రతిపాదన పెట్టినా చివరికి దానికి 2 లఖలకే పరిమితం చేసారు. ఇకనుండి  రూ.2 లక్షల పైన ఆర్థిక లావాదేవీలు  చేయాలంటే ఖచ్చితంగా బ్యాంకు ,చెక్ లేదా ఆన్ లైన్ ద్వారానే చేయాలనీ నగదు లావాదేవీలు చేస్తే అంత మొత్తంలో ప్రభుత్వానికి జరిమానా రూపంలో కట్టాల్సి ఉంటుందని, ఈ నిర్ణయం నుండి ఎవరికీ మినహాయింపు లేదని తెలిపారు, ఉదాహరణకు మీరు కారు కొని షో రూమ్ వారికి రూ.5 లక్షలని నగదు రూపంలో చెల్లించారని అనుకోండి, అప్పుడు మరో రూ. 5 లక్షలని జరిమానాగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కాని బ్యాంకులు, పోస్టాఫీసులు, కో-ఆపరేటివ్‌ బ్యాంకులు, ఆదాయపన్ను శాఖలకు చెల్లించే డబ్బుకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.

Also Read: డేంజర్ లో జియో కస్టమర్లు…!

(Visited 4,807 times, 118 visits today)

Comments

comments