Home / Political / ఇక నుంచీ టీచర్లూ కూడా టెన్త్ పరీక్షలు రాయాల్సిందే..!

ఇక నుంచీ టీచర్లూ కూడా టెన్త్ పరీక్షలు రాయాల్సిందే..!

Author:

TS

ఇక పరీక్షల భయం పిల్లలకే కాదు మార్చి దగ్గర పడుతూంటే టీచర్లకూ మొదలవనుంది. ఔను మీరు సరిగ్గానే చదివారు. పదవ తరగతి పరీక్షలని పిల్లలు రాసినట్టే ఇక నుంచీ టీచర్లు కూడా రాయాల్సిందే అంటూ తెలంగాణా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. సిలబస్ మీద అవగాహన కోసమూ,కొత్త విధానాల అవగాహన కోసమూ ఈ పద్దతి ప్రవేశపెట్టారట. అదీ ఈ సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది… ఈ వార్త విన్న టీచర్లంతా ఇక రాత్రుళ్ళు నిద్ర మానేసి చ్దవటానికి సిద్దపడిపోతున్నారు… ఇంతకీ విశయం ఏమిటంటే….

పదో తరగతి వార్షిక పరీక్షలను ఈ ఏడాది విద్యార్థులతోపాటు కొంతమంది ఉపాధ్యాయులూ రాయనున్నారు! కొత్త సిలబస్‌, సరికొత్త పరీక్షా విధానం గురించి తెలుసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఎటువంటి మార్పులు చేయాలో నిర్ణయించడానికే ఈ ప్రయోగం! తెలంగాణ విద్యా శాఖ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేయనుంది. ఈ మేరకు విద్యా శాఖ కమిషనర్‌ జి.కిషన్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది నుంచి విద్యార్థులకు కొత్త సిలబస్‌, సరికొత్త పరీక్షా విధానం అమల్లోకి వచ్చింది. గతంలో కొనసాగిన విధానంలో అధిక శాతం బట్టీ, ఉపాధ్యాయులు సూచించిన ప్రశ్నావళిపై దృష్టి పెట్టేవారు. ప్రస్తుత పరీక్ష విధానంలో మూస పద్ధతికి స్వస్తి పలికి, అవగాహనతో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. గతంలో నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 100 మార్కులకుప్రశ్నావళి ఉండేది. ఇందులో 25 మార్కులకు అబ్జెక్టివ్‌ మాదిరి ప్రశ్నలు ఉండటంతో విద్యార్థులు ఉత్తీర్ణత పొందే శాతం అధికంగా ఉండేది. ప్రస్తుతం ఇంటర్నల్‌ మార్కుల విధానం ప్రవేశపెట్టారు. ప్రతి సబ్జెక్టులో 20 మార్కుల చొప్పున పాఠశాల ఉపాధ్యాయులు వేయాల్సి ఉంటుంది. అలాగే, మారిన పరీక్ష విధానంలో పాఠ్యాంశాల్లోని ప్రశ్నలు యథాతథంగా కాకుండా విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేలా ఎక్కువ ప్రశ్నలు విద్యార్థిని ప్రశ్నిస్తూ ఉంటాయి. ‘ఈ పరిస్థితుల్లో నువ్వయితే ఏం చేస్తావ్‌? నీకు ఎదురైన అనుభవాలేమిటి?’ విశ్లేషణాత్మకంగా వివరించు అని అడిగి విద్యార్థుల నుంచి బాధ్యతాయుతమైన సమాధానాలు రాబడుతున్నారు. దీనికితోడు, కొన్ని సబ్జక్టుల్లో ప్రశ్నలు విద్యార్థుల స్థాయిని మంచి ఉంటున్నాయనే విమర్శలూ ఉన్నాయి. ఇక, పరీక్ష ప్రశ్నపత్రాల తయారీపైనా కొన్ని సార్లు విమర్శలు వస్తున్నాయి….

గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో సామాన్య శాస్త్రం పేపర్‌ చాలా కఠినంగా వచ్చిందని, దీంతో చాలామంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ఇస్తున్న ప్రశ్నా పత్రాలపై అధ్యయనం చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఈ పరీక్షల్లో ఇస్తున్న ప్రశ్నలను విద్యార్థులు ఎంతమేరకు అవగాహన చేసుకుని రాయగలుగుతున్నారు? ప్రశ్నలను అర్థం చేసుకుని జవాబులు రాయడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అన్న అంశాలపై దృష్టి సారించింది. విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్న పత్రాలను ఉపాధ్యాయులతో రాయిస్తేనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందని నిర్ణయించింది. ఇందులో భాగంగా, మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లోనే ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టడానికి సన్నాహాలు చేస్తోంది. పరీక్షల్లో తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, మ్యాథ్స్‌, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులతో పరీక్షలు రాయించనున్నారు. ఇందుకు ఒక్కో జిల్లా నుంచి మొత్తం 15 మందిని ఎంపిక చేయనున్నారు. అయితే, పదో తరగతి పరీక్షలను ఉదయం వేళల్లో జరుపుతున్నారు. విద్యార్థులు పరీక్షలు రాసేసిన తర్వాత వెంటనే ఉపాధ్యాయులకు నిర్వహించనున్నారు. రెండున్నర గంటలపాటు ఈ పరీక్ష ఉంటుంది. ఒకరి పేపరు ఇంకొకరికి లీకు (బహిర్గతం) కాకుండా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులే స్వయంగా వార్షిక పరీక్షలు రాయడం ద్వారా పరీక్షల్లో ఉన్న ఇబ్బందులు తెలుస్తాయి. విద్యార్థులను ఏ విధంగా పరీక్షకు సంసిద్ధులను చేయాలన్న అవగాహన కూడా కలుగుతుంది. వారి పరీక్ష పేపర్లను కూడా విద్యార్థుల తరహాలోనే దిద్దిస్తారు. అనంతరం వారి నుంచి నివేదికలు తీసుకుని భవిష్యత్తులో చేయాల్సిన మార్పులపై నిర్ణయం తీసుకుంటారట..

ఇక నుంచీ పదో తరగతి పరీక్షల్లో తమకు పాఠాలు చెప్పిన టీచర్లే తమతో కూచొని పరీక్షళు రాస్తూంటే చూడబోతున్నారు విద్యార్థులు. అయితే మనలో మన మాట కాపీయింగ్ చేస్తూ పట్టు బడిన టీచర్లను డీబార్ చేస్తారా లేక వదిలేస్తారా..?

Must Read:ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారా?.. హుషారుగా ఉండండి!

(Visited 1,354 times, 17 visits today)