EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / General / అతను పేస్ బుక్ లో చేసిన కామెంట్ వల్ల 42 రోజులు జైలు పాలయ్యాడు..ఇంతకీ ఏమని కామెంట్ చేసాడు.?

అతను పేస్ బుక్ లో చేసిన కామెంట్ వల్ల 42 రోజులు జైలు పాలయ్యాడు..ఇంతకీ ఏమని కామెంట్ చేసాడు.?

Author:

సోషల్ మీడియా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది  ఫేస్ బుక్. ఇందులో అకౌంట్ లేని వారు అంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య కాలంలో ఫేస్ బుక్ వినియోగం బాగా పెరిగిపోయింది. పొద్దున లేచింది మొదలు మళ్లీ నిద్రపోయే వరకు ఫేస్ బుక్ తో సమయం గడుపుతున్నారు. పిక్స్ పెట్టడం, కామెంట్లు చేయడం.. వాటికొచ్చే లైక్ లు, షేర్లు, రిప్లయ్ లు చూసుకుని మురిసిపోవడం. ఇదీ ట్రెండ్.ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ పోస్ట్స్ పెడుతుంటారు,ఒక్కోసారి అవ్వి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి.కొన్ని సార్లు జైలు పాలు కావాల్సి వస్తుంది..ఇప్ప్పుడు అదే పరిస్థితి ఉత్తర్ ప్రదేశ్ లో నివాసిస్తున్న ఒక యువకుడికి వచ్చింది.

ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన  పద్దెనిమిది సంవత్సరాలు  జాకిర్ అలీ త్యాగి,ఫేస్ బుక్ లో పెట్టిన కామెంట్ మూలంగా సమస్యలెదుర్కొన్నాడు..ఇంతకీ అతను చేసిన కామెంటేంటి అంటే.. గంగ,యమునా నదులకి మనిషితో సమానంగా ప్రాణులుగా పరిగణిస్తూ సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పుకి ఇతను వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో కామెంట్స్ చేసాడు,”గంగా నదికి మనిషికి ఉన్న హక్కులన్నీ ఉంటే మరి నదిలో మునిగి ఎవరైనా చనిపోతే నదికి శిక్ష వేస్తారా ” అన్ని ఒక ఫేస్ బుక్ పోస్ట్ పెట్టాడు,అందులోను ఇతను గవర్నమెంట్ కు,CM యోగి ఆదిత్యనాధ్ కు వ్యతిరేకి,అంతే ఇంకేముంది రాత్రి అయ్యేసరికి పోలీసులు అతని ఇంటి ముందు ఉన్నారు.అయితే అంతకు ముందు కూడా గవర్నమెంట్ రామ్ మందిర్ నిర్మిస్తాం అనడం కేవలం బూటకం మాత్రమే అని,మళ్ళి ఎలక్షన్స్ సమయం వరకు దాని గురించి పట్టించుకోరు అని కూడా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాడు.అలాగే ఇతను ఒక చనిపోయిన కానిస్టేబుల్ ఫోటోను తన DP గా పెట్టుకోవడం పైన కూడా పోలీసులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు…ఇంతకీ జాకిర్ అలీ త్యాగి ఎవరు

ఇతను భీం ఆర్మీ లో ఒక సభ్యుడు,గవర్నమెంట్ దళితులూ మరియు ముస్లిమ్స్ పట్ల చూపిస్తున్న వివక్షతకు వ్యతిరేకంగా పోరాడటం భీం ఆర్మీ లక్ష్యం.పోలీసులు ఇతని పైన పెట్టిన సెక్షన్ 66A ను సుప్రీమ్ కోర్ట్ కొట్టివేయడంతో ఆ కేసు ఎక్కువ కాలం నిలవలేదు.,కానీ జాకిర్ మాత్రం 42 రోజుల పాటు జైలు లో శిక్ష అనుభవించాల్సి వచ్చింది.ఆ సమయంలో తనని తీవ్రంగా హింసించినట్లు,ఫ్లోర్ మీద పడేసి కొట్టి వాళ్ళు చెప్పింది రాసె వరకు బలవంతం చేసినట్టు అతను మీడియాతో పేర్కొన్నాడు.

భావప్రకటన స్వేఛ్చ ఇండియాలోనే ఎక్కువ అంటారు.కానీ తప్పుల్ని ప్రశ్నించినా చిక్కులు తప్పవు..సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఒక మనిషి భావప్రకటన స్వేఛ్చ కిందికి వస్తుంది అని చెప్పినా కూడా  ప్రభుత్వాలు మాత్రం తమకు వ్యతిరేఖంగా పొస్టులు పెట్టిన వారిని ఇబ్బంది పెట్టడం చూస్తునే ఉన్నాం..జాకిర్ ఒక్కడే కాదు చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి.

(Visited 199 times, 44 visits today)