EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Devotional / ఈ రోజు: 23-10-2018 (మంగళవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?

ఈ రోజు: 23-10-2018 (మంగళవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?

Author:

మేష రాశి

గ్రహబలం అనుకూలంగా లేదు. చేపట్టే కార్యాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. సమాజంలో గౌరవం తగ్గకుండా వ్యవహరించాలి. అస్థిర నిర్ణయాలతో ఇబ్బంది పడతారు. ఆర్థిక పరంగా మిశ్రమ కాలం. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకోండి. కలహ సూచన. వారం మధ్యలో ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఈశ్వర సందర్శనం మంచిది.

వృషభ రాశి

శుభకాలం. మనసుపెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాల్ని కలిగించేవారు పక్కనే ఉంటారు. అపోహలకి అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ శ్లోకాలు చదివితే మంచిది. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ప్రయాణాలు చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

23-oct-2018-daily-rasi-phalalu

కటక రాశి

అనుకూల ఫలితాలున్నాయి. చేపట్టిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు. అవసరానికి తగిన సాయం అందుతుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్య సిద్ధి ఉంది. వ్యాపారంలో లాభాలుంటాయి. కొన్ని సంఘటనల ద్వారా నిజానిజాలు తెలుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. శివారాధన శుభప్రదం.

సింహరాశి

సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమయాన్ని మంచి విషయాలకై వినియోగించండి. ఆశించిన ఫలితాలు సిద్ధంగా ఉన్నాయి. తగిన కృషి చేయాలి. గతంలో విమర్శించినవారు ఇప్పుడు కీర్తిస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్త అవసరం. కీలక విషయాల్లో పెద్దల సలహాలు కీలకమవుతాయి. వారాంతంలో మంచి ఫలితాలున్నాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

కన్యా రాశి

విజయావకాశాలు మెరుగవుతాయి. పనులను వాయిదా వేయకండి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. కీలక విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సమయానికి ఆహారం తీసుకోవాలి. చెడుసావాసాల వల్ల మనోవిచారం కలుగుతుంది. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ నామస్మరణ శుభప్రదం.

తులా రాశి

తలపెట్టిన కార్యాన్ని నైపుణ్యంతో పూర్తి చేస్తారు. ఆదాయమార్గాలను పెంచుకుంటారు. మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. మీలోని త్యాగ గుణంతో అందరి ప్రశంసలు పొందుతారు. పెద్దల ఆశీస్సు లతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. బంధువులతో అనుకూలత ఉంది. శ్రీ లక్ష్మి గణపతి సందర్శనం శుభప్రదం.

వృశ్చికరాశి

తలపెట్టిన పనిని ఉత్సాహంగా చేయాలి. ఒక సంఘటన మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. మీమీ రంగాల్లో మీ పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో నిపుణుల సలహాలు అక్కరకు వస్తాయి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మేలు.

ధనుస్సు రాశి 

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్త్రయోగం కలదు. మీ చుట్టూ ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. ఆర్ధికంగా శుభ కాలం. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోరాదు. మీ పరిధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం మంచి ఫలితాన్నిస్తుంది. సమయానికి నిద్రాహారాలు అవసరం. శని శ్లోకం చదువుకోవాలి. సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం.

మకర రాశి

పట్టుదలే విజయానికి మూలం అని గ్రహిస్తారు. తలపెట్టిన కార్యంలో సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి వల్ల మంచి జరుగుతుంది. ఆత్మీయుల సహకారం ఉంటుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. లక్ష్మి నృసింహస్వామి ఆరాధన మనోధైర్యాన్ని పెంచుతుంది.

కుంభరాశి

చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయి. మీ పట్టుదలే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. గతంలో చేసిన పొరపాట్లను చేయకండి. మీ బుద్ధిబలంతో ఆర్ధికంగా ఎదుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. మీ మంచితనంతో అందరిని ఆకర్షిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. అపార్ధాలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అవసరం. హనుమత్‌ ఆరాధన శుభప్రదం.

మీన రాశి 

విశేషమైన శుభఫలితాలున్నాయి. తలపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్ధికంగా ఎదుగుతారు. ఆచార సంప్రదాయాలను గౌరవిస్తారు. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. బంధువులతో ఇల్లు కలకలలాడుతుంది. మధుర పదార్థాలు స్వీకరిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వారాంతంలో ఒక మంచి వార్తను వింటారు. రవి స్తోత్రాన్ని చదవాలి.

(Visited 1 times, 189 visits today)