Home / Latest Alajadi / సింగరేణిలో భర్తీ కానున్న ౩౦వేల వారసత్వ ఉద్యోగాలు

సింగరేణిలో భర్తీ కానున్న ౩౦వేల వారసత్వ ఉద్యోగాలు

Author:

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్ సీసీఎల్) సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు దశాబద్ధాలుగా ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగాల  పునరుద్ధరణకు మోక్షం కలిగింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 జనవరి 1 నుంచి వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 48–58 ఏళ్ల మధ్య వయసున్న సింగరేణి కార్మికులు అనారోగ్య కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వారి వారసులకు ఉద్యోగం ఇప్పించేందుకు అర్హులు.

30000 succession jobs in singareni

సింగరేణి ఉద్యోగి ఈ అర్హతలు కలిగి ఉండాలి..

  • 48–58 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి కనీసం రెండేళ్ల సర్వీసు ఉండాలి. అనారోగ్య కారణాలతో సర్వీసులో కొనసాగలేరని కంపెనీ మెడికల్‌ బోర్డు ధ్రువీకరించాలి.
  • దరఖాస్తు నాటికి రెండేళ్లకు మించి సర్వీసు ఉన్న ఉద్యోగులు 58 ఏళ్ల వయసు వచ్చాకే పదవీ విరమణ చేసేందుకు అవకాశం ఉంటుంది.
  • అనారోగ్య కారణాలతో యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగిస్తే మాత్రం అంతకు ముందే పదవీ విరమణకు అవకాశం కలగనుంది.
  • భార్యాభర్తలిద్దరూ కంపెనీ ఉద్యోగులైతే.. ఒకరే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

వారసులకు ఉండాల్సిన అర్హతలివీ..

ఉద్యోగిపై పూర్తిగా ఆధారపడి, అతడితో కలిసి నివాసం ఉండే కుమారుడు/అల్లుడు/తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందడానికి అర్హులు. ఉద్యోగి కోరిక మేరకు సంస్థ వీరిలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పిం చనుంది. రెండో భార్యకు పుట్టిన కొడుకు, చట్టబద్ధంగా కాని పెళ్లి ద్వారా పుట్టిన సంతానం, దత్తత కొడుకులు ఈ పథకం కింద ఉద్యోగాలు పొందడానికి అనర్హులు.

Comments

comments