EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

దేశం కోసం కోటి రూపాయల విదేశీ ఉద్యోగాన్ని కాదన్న నలుగురు IIT విద్యార్థులు.

Author:

మీకు ఏడాదికి కోటి రూపాయల జీతంతో అమెరికాలో ఉద్యోగం ఇస్తాం అంటే ఏం చేస్తారు..? ఎగిరి గంతేసి అమెరికాకి వెళ్ళిపోతారు..! కోటి అనే కాదు నెలకి లక్ష రూపాయల జీతం ఇచ్చిన చాలు అని అమెరికా ఉద్యోగం ఎదురుచూసే వారు చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం దేశం కోసం కోటి రూపాయల ఉద్యోగాన్ని వదులుకున్న నలుగురు విద్యార్థులది..!

iitDelhi_01

ఢిల్లీ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) క్యాంపస్ లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయ్, ప్రపంచంలోనే అత్యుత్తమైన పెద్ద పెద్ద కంపెనీలు రిక్రూట్మెంట్ ని చేపట్టాయి, చాలా మంది విద్యార్థులకి అదిరిపోయే ప్యాకేజ్ లని ఆఫర్ చేసి రిక్రూట్ చేసుకుంటున్నారు, అందులో అత్యుత్తమ ప్రతిభ కలిగిన నలుగురు విద్యార్థులకి ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజిని ఆఫర్ చేసింది ఒక కంపెనీ, ఉద్యోగం సంపాదించడమే కష్టంగా మారిన ఈరోజులలో కోటి రూపాయల ప్యాకేజి అంటే కళ్ళు మూసికొని ఉద్యోగంలో చేరిపోతారు ఎవరైనా, కానీ నీ ఈ నలుగురు కుర్రాళ్లు మాత్రం కోటిరూపాయలు ఇస్తానన్న జాబ్ ఆఫర్ ని తిరస్కరించారు.

iit-students-rejected-job

ఆ కంపెనీ వారు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఇస్తాం అని ఆఫర్ చేశారు, అయిన కూడా ఆ నలుగురు కుర్రాళ్ళు “సారీ సార్ మేం చేయలేం అంటూ ఖరాఖండిగా చెప్పేశారు, మాకు చదువుకోవడానికి మా దేశం అనేక వసతులు కల్పించింది, ఉత్తమమైన ఫ్యాకల్టీతో పాటు మా ఫీజులని కూడా మా దేశ ప్రజలే చెల్లించారు (మనం పన్నుల రూపంలో కట్టిన డబ్బులని విద్యార్థుల స్కాలర్ షిప్ లకి కూడా ఉపయోగిస్తారు) మేం మా ప్రతిభను విదేశీ కంపెనీల ఎదుగుదలకు వాడాలనుకోవడం లేదు.. మా అవసరం మాదేశానికి చాలా ఉంది. ఇక్కడి చదువును ఇక్కడి అభివృద్దికే ఉపయోగిస్తాం, మీ కోటి రూపాయల ఆఫర్ కన్నా మేకిన్ ఇండియా అనే నినాదమే మాకు బాగా నచ్చింది” అని ఆ కంపెనీ వారికి తేల్చి చెప్పారు.

అత్తెసరు మార్కులతో ఇంజినీరింగ్ పాస్ అయిన వారు కూడా M.S అంటూ, ఉద్యోగం అంటూ డాలర్ వేటలో విదేశాలకి వెళ్లి తమ మాతృ భూమిని మర్చిపోతున్న ఈ రోజులలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ క్యాంపస్ లో చదివి కోటి రూపాయల జీతాన్ని కూడా అవసరం లేదు దేశ అభివృద్ధి కోసమే పని చేస్తాం అని ఈ నలుగురు విద్యార్థులు అందరికి ఆదర్శంగా నిలిచారు.

Must Read: 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేయలేని పనిని ఒక్క నెలలో చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులు.

(Visited 5,371 times, 57 visits today)

Comments

comments