రూ.500కే 4జీ స్మార్ట్‌ఫోన్..! రూ.60 కే ఉచిత ఇంటర్నెట్, వాయిస్ కాల్స్…!

Author:

కొత్త కొత్త ఆఫర్లతో రిలయన్స్ జియో సృష్టించిన ప్రభంజనానికి మొబైల్ నెట్ వర్క్ లలో మొదటి స్థానాల్లో ఉన్న ఎయిర్ టెల్, ఐడియా, వోడా ఫోన్ కంపెనీలు అతలాకుతలం అయిపోయాయి, అతి తక్కువ ధరకి ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, మెస్సేజ్ ఆఫర్లని ప్రకటించి రూ.1500 లకే 4g ఫీచర్ ఫోన్ ని ప్రకటించిన జియోని ఎదుర్కోవడానికి ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ కంపెనీలు కలిసి ఉమ్మడిగా దండయాత్రని మొదలుపెట్టాయి, నష్టం వచ్చిన సరే..జియోకి అయితే చుక్కలు చూపించాల్సిందే అని డిసైడ్ అయ్యాయి కంపెనీలు. ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ మూడు కంపెనీలు కలిసి.. జియోకి బాబు లాంటి ఫోన్లు, ఆఫర్ తీసుకురాబోతున్నాయి. ఇండియా టెలికాం రంగంలోనే భారీ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. జియోని మించిన ఆఫర్లని ప్రకటించి జియోని దెబ్బ కొట్టాలని ఫిక్స్ అయ్యాయి.

రూ.500కే 4జీ స్మార్ట్‌ఫోన్..!

ఈ మూడు టెలికం కంపెనీలు కలిసి కేవలం రూ.500 లకి 4G స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నాయి, దాంతోపాటు నెలకు కేవలం రూ.60కే అన్ లిమిటెడ్ వాయిస్, డేటా ఇవ్వనున్నాయి. ప్రస్తుతం జియో వాయిస్ కాల్స్ 2G వేగంతో నడుస్తున్నాయి. రూరల్ ఏరియాలో మిగతా నెట్ వర్క్ ల నుంచి మద్దతు లేకపోవటంతో జియో ఇబ్బంది పడుతుంది. దీన్ని అవకాశం తీసుకుని.. 500కే 4G స్మార్ట్ ఫోన్.. నెలవారీ ప్లాన్ 60కే.. వాయిస్ కాల్స్ కూడా 4G స్పీడ్ తో ఇవ్వాలని ఈ మూడు కంపెనీలు కలిసి ఈ ఫ్లాన్ చేశాయి. దీని ద్వారా గ్రామాల్లో కొత్త కస్టమర్లను ఆకర్షించటానికి వీలవుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ యాక్షన్ ఫ్లాన్ అమల్లోకి తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తే టెలికం రంగంలో మరో సంచలనం సృష్టిస్తుంది.

(Visited 945 times, 986 visits today)