EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   హైదరాబాద్ లో రోబో కిచెన్   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Inspiring Stories / ఇంటర్ లో ఫెయిల్… ఇవాళ ఒక కంపెనీకి సీఈవో

ఇంటర్ లో ఫెయిల్… ఇవాళ ఒక కంపెనీకి సీఈవో

Author:

ఒకపుడు ఇంటర్ లో ఫెయిల్ అయిన అబ్బాయి, ఇవాళ ఒక కంపెనీకి సీఈవో అంటే నమ్మగలరా..? ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే జీవితమే కోల్పోయినట్టు ఫీలై ఆత్మహత్యలు చేసుకునే వారిని చూసాం. కానీ, ఓటమిని గెలుపుకి సోపానంగా మార్చుకోవడమే కాదు.. ఒక కంపెనీ పెట్టి వందల మందికి ఉపాధి ఇవ్వగలిగే స్థాయికి వచ్చిన ఆ యువకుడే సంజయ్ ఎనిశెట్టి. హైదరాబాద్ కి చెందిన సంజయ్ వృత్తిపరంగా వ్యాపార కుటుంబమే. కామర్స్ అంటే ఇష్టమున్నప్పటికీ ఇంటర్ లో ఎంపీసీ తీసుకున్నాడు. దాంతో మాథ్స్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాడు. ఒక ఏడాది వృధా అయ్యింది. ఆ ఖాళీ సమయం లోనే ఇంటింటికీ మినరల్ వాటర్ టిన్స్ అందించడం చేశాడు. వ్యాపారం అంటే ఏంటో అప్పుడే కొద్దిగా అర్థమయింది. తాను కూడా సొంతంగా వ్యాపారం చేద్దాం అనుకుని ఇంట్లో చెప్పాడు. తండ్రి, తాతలు కూడా వ్యాపారం చేసేవారే… కానీ, సంజయ్ వ్యాపారం చేస్తా అంటే మాత్రం వద్దు.. బాగా చదువుకో అనే వారు.

Sanjay-Enishetty_Fb

తర్వాత డిగ్రీ, లా కోర్సు కూడా కంప్లీట్ చేసినప్పటికీ.. ఉద్యోగం చేయడం కంటే పది మందికి ఉపాధి కల్పించటమే ధ్యేయంగా ముందుకు నడిచాడు. రెండు మూడు కంపెనీల్లో సేల్స్ విభాగంలో, పర్సెప్ట్ అనే కంపెనీలో బ్రాండింగ్ విభాగంలోనూ పని చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఒక కంపెనీలో పని చేస్తునప్పుడు మహేష్ అనే సీనియర్ ఎంప్లాయ్ పరిచయం తన జీవితాన్ని మలుపు తిప్పింది అంటాడు సంజయ్. సొంతంగా వ్యాపారం చేయాలనే తన ఆలోచనలకు ఊపిరినిచ్చి ఊతమిచ్చాడు అని మహేష్ పట్ల తన కృతజ్ఞతను వ్యక్తపరిచాడు. 50కే వెంచర్స్ అనే కంపెనీ పెట్టి కొత్తగా స్టార్టప్ కంపెనీలు పెట్టేవారికి ఆర్ధిక వనరులు, మానవ వనరులు అవసరమైన నెట్ వర్క్ అందజేస్తున్నాడు. కొత్తవారికి ఎదిగే అవకాశం ఇస్తూ… తానూ ఎదుగుతున్న సంజయ్ జీవితం నిజంగా అందరికీ స్పూర్తిదాయకం. ఒక్క ఓటమి ఎదురు కాగానే కుంగిపోకుండా అనేక స్టార్టప్ కంపెనీలకు ఫండ్స్, నెట్ వర్క్ సదుపాయాలూ అందిస్తూ శరవేగంగా దూసుకుపోతున్న సంజయ్ జీవితం మరెంతో మందికి స్పూర్తినివ్వాలని ఆశిద్దాం.

(Visited 1 times, 80 visits today)