ఈ అమ్మాయి మాట్లాడిన స్పీచ్ లో ఎన్నో ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి..!

Author:

గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామో మన దేశంలో చాలా మందికి తెలియదు, అలాంటిది ఒక 7 వ తరగతి అమ్మాయి, దేశం గురుంచి, దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల గురుంచి, రాజ్యాంగం గురుంచి అద్భుతంగా మాట్లాడింది, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వికారాబాద్ NNH హై స్కూల్ లో 7 తరగతి చదువుతున్న మహతి అనే అమ్మాయి స్కూల్ లో జరిపిన గణతంత్ర దినోత్సవం వేడుకలో మాట్లాడుతూ “మన అందరికి దేశభక్తి ఆగస్టు 15 న, జనవరి 26 న మాత్రమే వస్తుంది, తెల్లారగానే దేశాన్ని, జాతీయ జెండాని మరిచిపోతాం ఈ మాత్రం దానికి ఇన్ని సంబరాలు ఎందుకు..? ఎంతో మంది పోరాటం చేసి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం తీసుకొచ్చారు, మనం మాత్రం మళ్ళీ వాళ్ళ కంపెనీలలో పనిచేయడానికే మొగ్గుచూపుతున్నాం, వాళ్ళు చేసిన త్యాగాలు వృధానే కదా అని ప్రశ్నించింది, అందరు డాక్టర్లు, ఇంజినీర్లు అవ్వడానికి మాత్రమే చదువుని కొంటున్నారు , మిగిలినవి జాబ్స్ కావా..? అని ప్రశ్నిచింది. ఇంత చిన్న వయసులోనే అంత గొప్పగా దేశం గురుంచి అలోచించి మాట్లాడిన మహతి మాటలని దేశాన్ని ప్రేమించే ప్రతిఒక్కరు వినాలసిందే..!

(Visited 2,603 times, 232 visits today)

Comments

comments