Home / Inspiring Stories / సెంట్రల్ హిమాలయాస్ కేంద్రంగా రానున్న భూకంపం.

సెంట్రల్ హిమాలయాస్ కేంద్రంగా రానున్న భూకంపం.

Author:

Earthquake at Himalayas in India

మణిపూర్ ప్రాంతంలో సోమవారం సంభవించిన లాంటి భూకంపాలు మరిన్ని వచ్చే ప్రమాదం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. టెక్టోనిక్ షిఫ్ట్ కారణంగా ఇటీవల మణిపూర్, నేపాల్, సిక్కిం ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి. అది ఇప్పుడు మళ్లీ పాడైందని, దానివల్లే 8.0కు పైగా తీవ్రతతో భూకంపాలు సంభవించే పరిస్థితులు ఏర్పడ్డాయట మూనటికి మొన్న నేపాల్‌లో సంభవించిన భూకంపం యావత్తు ప్రపంచాన్నే కదిలించింది. ఆ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9. ఈ దుర్ఘటనలో 4 వేలకు పైగా మంది మృతిచెందారు. 8 వేల మంది గాయపడ్డారు.ఇప్పుడు రాబోయే విపత్తు నేపాల్లో వచ్చిన భూకంపానికంటే 40 రెట్లు అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే..!? హిమాలయ ప్రాంతంలో త్వరలో భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉందట. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణులు తెలిపారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.2 వరకు ఉండే ప్రమాదముంది.అంటే నేపాల్ లో వచ్చిన ప్రకంపనకన్నా ఎక్కువ భూకంపాలు రాకుండా నివారించలేం. వాటి రాకను అంచనా వేయలేం. కానీ అవి కలిగించే నష్టాన్ని తగ్గించగలం.!నిజానికి భూకంపం వల్ల కలిగే నష్టం కాన్నా భూకంప దుర్ఘటనల్లో 95శాతం మరణాలు ఇళ్లు, భవంతులు కూలడంవల్లే చోటుచేసుకుంటాయి. భూకంపం పరోక్షంగా భూపాతాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, సునామీలకు ఓ హేతువు. జపాన్ వంటి దెశాలలో ఉండే జనాభా తో పోలిస్తే మనదేశం లో ఉండే జనాభా ని బట్టి అధిక సంఖ్యలో మరణాలు నమోదవవచ్చు. భారత్‌లో 59 శాతం భూభాగానికి భూకంపాల బెడద ఉంది. 1990-2006 మధ్య కాలంలో దేశాన్ని వణికించిన ఆరు పెను భూకంపాలకు 23వేల మంది మరణించగా అపార ఆస్తినష్టం వాటిల్లింది. 1991లో ఉత్తర కాశీ, 1993లో లాతూర్‌, 1997లో జబల్పూర్‌, 1999లో చమోలీ, 2001లో భుజ్‌, 2005లో జమ్మూ-కశ్మీర్‌లో వచ్చిన భూకంపాలు చేసిన నష్టం మామూలుదేం కాదుదు.

Earthquake at Himalayas in India

ఐతే ఈ సారి వచ్చే భూకంప కేంద్రం సెంట్రల్ హిమాలయాస్ అనటమే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని నగరం ఈటానగర్‌లో కేంద్రం ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో కూడా భూగర్బ శాస్త్ర వేత్తల బృందం ఈ విషయాన్ని తెలిపారు. భారత్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల మధ్య అనుసంధానం అయి ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల వల్ల చాలా ప్రమాదం ఉందని ఎన్ఐడీఎం డైరెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. బిహార్, యూపీ, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా త్వరలోనే భారీ భూకంపం రావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు అంతర్జాతీయ భూకంప నిపుణులు కూడా రాబోయే భూకంపం గురించి హెచ్చరిస్తున్నారు. ఇది ప్రకృతి సిద్ధమైన టైమ్ బాంబ్ అని, దీనిపై ప్రభుత్వ వర్గాలు జాగ్రత్త పడాలని కుమార్ తెలిపారు.

Earthquake at Himalayas in India

అయితే ఈ భూకంపం వచ్చేసమయం మాత్రం ఖచ్చితంగా చెప్పలేమనే అంటున్నారు.2018కి అటు ఇటుగా ఈ భారీ భూకంపం ఉండవచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ భారీ భూకంపం ప్రపంచంలో ఎక్కడైనా రావొచ్చునని, అయితే హిమాలయాలు కేంద్రంగా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ భారీ భూకంపం వస్తే హిమాలయ పరిసరాలు దెబ్బతినడమే గాక ఏయే దేశాల మీద ప్రభావం పడుతుందో చెప్పటం కష్టతరం. ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎంతమేరకు వాటిల్లుతుందో కూడా అంచనాకు అందదు. హిమాచల్ ప్రదేశ్ నుండి వెస్ట్ నేపాల్ వరకు దీని ప్రభావం పడవచ్చునంటున్నారు. అయితే కచ్చితంగా ఆ భూకంపం ఎప్పుడు వస్తుందో మాత్రం అప్పుడే చెప్పలేమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం లేదా పదేళ్ల తర్వాత రావొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారని సమాచారం.

(Visited 369 times, 103 visits today)