Home / Inspiring Stories / 850 ఎకరాల ఫాం హౌస్ కేవలం 100 రూపాయలకే

850 ఎకరాల ఫాం హౌస్ కేవలం 100 రూపాయలకే

Author:

ఈ రోజులలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకోవాలంటేనే వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. చాలా తక్కువ స్థలంలో ఉన్న ఫాం హౌస్ లని అద్దెకు తీసుకోవాలన్నా లక్షల రూపయలు వెచ్చించాల్సిన రోజులు, అలాంటిది వందల ఎకరాల విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ను, అదీ ఏకంగా పదేళ్ళ పాటు అద్దెకు తీసకోవాలంటే ? కోట్లలోనే ఖర్చవుతుంది కదా,  మరి ఇదేంటి 100 రూపాయలకే 850 ఎకరాల ఫాం హౌస్ అని ఆశ్చర్యపోతున్నారా,  కానీ ఇది నిజమండీ బాబూ,  ఇంగ్లాండ్‌లోని సౌత్‌వేల్స్‌ సమీపంలో ఉన్న పార్స్‌ ఫామ్‌ను ఏడాదికి కేవలం వంద రూపాయలకే అద్దెకిస్తామంటోంది ఓ స్వచ్ఛంద సంస్థ.  ఆసక్తి ఉన్న వారి నుంచి ధరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నా  850 ఎకరాల పార్స్‌ ఫామ్‌ను ఏడాదికి వంద రూపాయల చొప్పున పదేళ్ల వరకు అద్దెకించ్చేందుకు ఒకే అంటున్నారు.

farm-house 820 acres

సముద్రపు అంచున ఉన్న ఈ పార్స్‌ ఫామ్‌ను అద్దెకు తీసుకుంటే అందులోని 4 బెడ్‌రూం ఇల్లుతో పాటు.. 416 గొర్రెలను కూడా ఇస్తారట, దీనికి ముందుగా అప్లికేషన్‌ పెట్టుకోవాలి. అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది అలా అప్లికేషన్ పెట్టిన వారిలో పర్యావరణం, ప్రకృతిపై మక్కువ ఉన్నవారిని ఎంపిక చేసి దీన్ని అద్దెకిస్తారట, అలా ఎంపిక చేయటానికి కూడా ముందుగానే ఒక టీం ని పెట్టేసారు, ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ఫామ్‌లో కొన్ని అంతరించిపోతున్న జీవ జాతులు ఉన్నాయి. వాటిని కాపాడే ఉద్దేశంతో ప్రకృతి ప్రేమికులను ఎంపిక చేసి ఈ క్షేత్రాన్ని అద్దెకివ్వనున్నారు.  దీన్ని అద్దెకు తీసుకున్న వారు అక్కడి జీవ జాతులను పరిరక్షించాలనే షరతు పెట్టారు. ఎంపిక అయిన వ్యక్తీ షరతులు అన్నీ ఒప్పుకుంటేనే దానిని అప్పగిస్తారు అంతే కాదు ఇంతకుముందు వ్యవసాయం చేసిన అనుభవంతో పాటు గతంలో ప్రకృతిని పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ అప్లికేషన్‌ను జూన్‌ 10లోపు సదరు స్వచ్ఛంద సంస్థకు పంపించాలట. దరఖాస్తులన్నింటినీ నేషనల్‌ ట్రస్ట్‌ ప్యానల్‌ పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుందట. మరి మీలో ప్రకృతి ప్రేమికులు ఎవరన్నా ఉంటె త్వరపడండి అలా ఎంచక్కా ఓ పదేళ్ళు ప్రకృతి ఒడిలో గడిపేయోచ్చు.

Click here to Apply: Nationaltrust.org

Must Read: ఒక్క లీటర్ పెట్రోల్ తో 410 కిలోమీటర్ల మైలేజి.

(Visited 1,835 times, 28 visits today)