EDITION English తెలుగు
రైళ్లలో దోపిడీకి ప్రయత్నించే దొంగలను కాల్చి వేయాలని డిసైడ్ అయ్యింది:రైల్వేశాఖ   ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటుపై తల్లిదండ్రుల సంఘం తీవ్ర నిరసనలు   గవర్నర్ ప్రారంభించిన...అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో రైలు పరుగులు   రికార్డు స్థాయికి: పెట్రోల్‌ ధర తొలిసారి రూ.90 దాటింది   ఉదయం అలారం మొగిందా ? అయితె దాన్ని ఆపెసి మళ్ళీ పడుకొంటున్నరా ? అయితె ఈ మనసు మనిషి సంఝర్షణ మీ కొసమె   గ్రీవియెన్స్ ఆఫీసర్ని నియమించిన వాట్సాప్-ఇండియా   సీట్ల సంఖ్యకు మించి ప్రయాణికులను బస్సుల్లో ఎక్కించరాదని ఆర్టీసీ ఆదేశాలు   బాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలం లో రూ.16.60లక్షలు అమ్ముడయ్యాయి   వెంక‌టేష్ త‌న కూతురి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ .!   భారతదేశం ఇటీవలి కాలంలో పేదరికంపై భారీ విజయాన్నే సాధించింది: ఐరాస

ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో చూస్తే మీకు కన్నీళ్లు వస్తాయి..!

Author:

పుస్త‌కాల బరువు ఓ నిండు ప్రాణాన్ని బ‌లితీసుకుంది. వ‌రంగ‌ల్ కు చెందిన 9 వ త‌ర‌గ‌తి విద్యార్థిని దాదాపు 10 కేజీల బ‌రువున్న త‌న పుస్త‌కాల బ్యాగ్ ను మోసుకుంటూ మూడ‌వ అంత‌స్తులో ఉన్న త‌న క్లాస్ రూమ్ కు చేరుకొని , ఒక్క‌సారిగా సొమ్మ‌సిల్లి ప‌డిపోయింది. హుటాహుటిన హాస్పిట‌ల్ కు త‌ర‌లించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. ! ఒక్క‌సారిగా బిపి డౌన్ అయ్యి, ఆమె మ‌ర‌ణించింద‌ని డాక్ట‌ర్లు నిర్థారించారు.! ఈ విష‌యంలో స‌ద‌రు స్కూల్( కౌటిల్య స్కూల్ ) మీద కేసు న‌మోదైంది.

త‌ప్పెవ‌రిది?
ఇటీవ‌లే తెలంగాణ ప్ర‌భుత్వం పుస్త‌కాల బ‌రువుకు సంబంధించిన కొన్ని నిబంధ‌న‌ల‌ను పెట్టింది. ప్ర‌భుత్వ పాఠ‌శాల అయినా ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ అయినా ఈ నిబంధ‌న‌లు పాటించాల్సిందే.! కానీ ఇక్క‌డ జ‌రిగిందేంటి? ఆ అమ్మాయి వీపు మీద ఉన్న ఆ పుస్త‌కాల బ‌రువు దాదాపుగా 10 కేజీల పైనే ఉంటుంది? ఈ విష‌యంలో ఏవ‌రిని నిందించాలి? ఎక్కువ పుస్త‌కాలుంటేనే ఎక్కువ చ‌దువు వ‌స్తుంద‌నే భ్ర‌మ‌లో ఉన్న త‌ల్లిదండ్రుల‌నా? ప్రైవేట్ స్కూల్ లో 10 పుస్త‌కాలెక్కువుంటాయ్..అప్పుడే గ‌వ‌ర్న‌మెంట్ క‌న్నా ఎక్కువ‌గా చెబుతున్నాం అనే ఇంటెన్ష‌న్ క్రియేట్ అవుతుంద‌నుకుంటున్న ప్రైవేట్ స్కూల్స్ యాజ‌మాన్యానిదా? నిబంధ‌న‌లు విధించిన త‌ర్వాత కూడా క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించ‌ని విద్యాఅధికారుల‌దా?
తప్పెవ‌రిదైనా బ‌లైనా ఆ నిండు ప్రాణాన్ని మాత్రం ఎవ్వ‌రూ తీసుకురాలేరు.! ఇక‌నైనా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకొని ..రేప‌టి బాల‌ల భుజాలపై బుక్స్ పేరిట హ‌మాలీ బ‌రువులు మోయించ‌కండి.!!

అస‌లు ఏ త‌ర‌గ‌తి ఎంత బ‌రువున్న బుక్స్ ఉండాలి?( తెలంగాణ ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి)

  • LKG to 2nd Class : 1.5 KG.
  • 3rd Class to 5th Class: 3Kgs.
  • 6th Class 7th Class: 4Kgs
  • 8th Class to 9 th Class : 4.5
  • 10th Class ———: 5 Kgs.

Watch Video Here:

(Visited 204 times, 36 visits today)