Home / Inspiring Stories / ఫేస్ బుక్ లో కన్నీళ్ళు పెట్టిస్తున్న కన్నతల్లి లేఖ.

ఫేస్ బుక్ లో కన్నీళ్ళు పెట్టిస్తున్న కన్నతల్లి లేఖ.

Author:

Road Accidents

తెలుగు రాష్ట్రాల్లో ఏటా రోడ్డు ప్రమాద మరణాలు ఏటా పెరుగుతూనే ఉన్నయి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ నేర గణాంక సంస్థ 2014 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన ”ప్రమాద మరణాలు-ఆత్మహత్యల వార్షిక నివేదిక(ఏడీఎస్‌ఐ-2014)” దేశంలో ప్రమాదాల తీవ్రతను చెబుతోంది దేశవ్యాప్తంగా 2014లో 4.51 లక్షల మంది ప్రమాదాల్లో మృతి చెందారంటూ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న దుర్ఘటనలుజాతీయ నేర గణాంక సంస్థ వార్షిక నివేదికలో వెల్లడిఈనాడు – హైదరాబాద్‌దేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రోడ్డు, రైలు ప్రమాదాలతో పాటు ఇతర సాధారణ ప్రమాదాలూ రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ కారణంగా ఏటా వేలమంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. కొన్ని వేల మంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు. ఇందులో అత్యధికమంది 45 ఏళ్లలోపే వారే కావడం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. .రహదారి ప్రమాద మరణాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ఏడోస్థానంలో ఉండగా, తెలంగాణ తొమ్మిదోస్థానంలో ఉంది..

ఏడాదికోసారి వారోత్సవాలు నిర్వహించడం తప్ప రోడ్డు భద్రతపై మన ప్రభుత్వాలు చేపడుతున్న కార్యాచరణేదీ లేదు. చిత్తశుద్ధి అంతకన్నా లేదు. రోడ్డు ప్రమాదాల్ని తగ్గించి నిండు ప్రాణాల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత పైనా, అందుక్కావాల్సిన భద్రతా చర్యలపైనా సామాజిక చైతన్యం మన దేశంలో అంతంత మాత్రమే! ‘నిండు ప్రాణాలు బలి’,‘ నెత్తురోడుతున్న రహదారులు’, ‘అసువులు బాసిన కుటుంబం’ అని టీవీల్లో, పత్రికల్లో పతాక శీర్షికల్లో నిత్యం చూస్తూనే ఉంటాం. నిండు జీవితాలు అలా గాల్లో కలిసిపోవ డం… ఒక రోజు వార్తగానో, నాలుగు రోజుల దర్యాప్తుగానో, కారకులైన వారికి కొన్నాళ్ల శిక్షలుగానో మారి రికార్డుల్లో జమవుతున్నాయి. అంతేగానీ సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. మళ్లీ అవే ప్రమాదాలు, మరణాలు. వాహనాలు నడిపేవారి అలవిమాలిన అలక్ష్యం, అస్తవ్యస్థమైన రోడ్లు, నిద్రాణమైన వ్యవస్థలు, నీరుగారుతున్న దర్యాప్తులు, ప్రభావమే చూపక పలుచబారుతున్న చట్టాలు-శిక్షలు… వెరసి రోడ్డు భద్రత కేవల నినా దంగా మిగిలిపోతోంది…

ఈ నేపథ్యం లో మొన్నటికి మొన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో మరణించిన హర్షారెడ్డి మరణానికి అతని తల్లి ఫేస్ బుక్ లో రాసిన లేఖ మన కళ్ళని ఒక సారి తడి చేయక మానదు.. ”హర్షా… నువ్వు చనిపోయి సరిగ్గా రెండు నెలలు. నువ్వు లేక రోజులన్నీ చాలా భారంగా గడిచాయి. నువ్వు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు క్షణక్షణం గుర్తుకొస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు. మొన్న అజారుద్దీన్ కుమారుడు ఆయాజుద్దీన్, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు ప్రతీక్‌రెడ్డి, తరువాత నువ్వు.. రహదారి ప్రమాదాలకు బలయ్యారు. ఇకపై ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నా. మరో తల్లికి ఇలాంటి కడుపుకోత వద్దు. ఎందుకంటే… నిన్ను పోగొట్టుకుని మేం ఎంత బాధతో కుమిలి పోతున్నామో మా కన్నీళ్లకు తెలుసు. జీవితం ఎంత విలువైందో ఈ తరానికి తెలియాలి. పిల్లలూ… ఇది నా హృదయపూర్వక విన్నపం. జీవితంలో స్నేహం ఒక భాగం మాత్రమే. అందుకోసం జీవితాలనే బలి చేసుకోవద్దు. మీ భాషలో చెప్పాలంటే వేగం మజా ఇస్తుంది… ప్రాణాన్ని బలి తీసుకుంటుంది. అందుకే ‘స్లో అండ్ స్టడీ… విన్స్ ద లైఫ్’.. అర్ధరాత్రి దాటినా… మీ కోసం మీ అమ్మ గడపవద్దే ఎదురు చూస్తూ ఉంటుంది. వారి కోసం మీరు జీవించాలి.. ఐ మిస్ యూ హర్షా.”

మలక్‌పేటలో నివాసం ఉంటున్న వెంకట శ్రీహర్షారెడ్డి. 26వ తేదీ తెల్లవారుజామున నల్గొండ జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామ సమీపంలో కల్వర్ట్‌ను కారు డీకొట్టిన సంఘటనలో కారు ఎగిరి రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న శ్రీహర్షారెడ్డి, మోబిన్, మంజునాథ్ చనిపోయారు. శృతిమించిన వేగం,నిద్రమత్తూ ప్రమాదకారణాలు గా తేలాయి. ఎంతమంది తల్లుల వేదనో ఇలా రోడ్లపై రక్తం గా ప్రవహిస్తున్నయ్. మితి మీరిన వేగం, థ్రిల్ కొసం వెతుకులాటల్లో ప్రాణాలు కోల్పోతున్న యువకులెందరో. ఎప్పటికి ఆగుతుందో ఈ మరణాల సంఖ్య….

Must Read: అమ్మని వెతకటం కోసం దేశాలు దాటివచ్చారు.

(Visited 1,136 times, 22 visits today)