EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరి

Author:

బ్యాంకు ఖాతాదారులందరూ వెంటనే ఆధార్ కార్డు నంబరుని తమ అన్నిఖాతాలతో అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే గ్యాసు, సబ్సిడీలు, ఉపకార వేతనాలు.. అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అంటుండడం తెలిసిందే. ఇక బ్యాంకు అకౌంట్లన్నింటికీ కూడా ఆధార్ నంబర్ ని డిసెంబర్ 31 లోపు జత చేయాల్సిందేనని కేంద్ర రెవెన్యూ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందు నిమిత్తం కొన్ని సవరణలు కూడా చేసింది. దీనివల్ల నల్లధనం, అక్రమ నగదు లావాదేవీలను కొంతమేరకు అరికట్టవచ్చు.

aadhaar must for bank account

ఇప్పటికే కొంతమంది దొడ్డిదారిన రెండు, మూడు పాన్‌ బుక్ లు తీసుకొని, పన్నుకట్టకుండా ఎగవేస్తున్నారని, ఇలాంటి అక్రమాలన్నీ అరికట్టడానికే పాన్‌, ఆధార్‌లను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఇక నుంచీ బ్యాంకు ఖాతా తీసుకున్నపుడే ఆధార్‌ నంబర్ ని పేర్కొనాలి. వ్యక్తులు, కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు ఎవరైనా 50 వేల రూపాయలు అంతకన్నా ఎక్కువ డబ్బుతో లావాదేవీలు జరిపినప్పుడు కూడా కచ్చితంగా ఆధార్‌, పాన్‌ నంబర్లను తెలపాల్సి ఉంటుంది. పాన్‌ నెంబరు లేని వారు సమర్పించే ఫారం-60 పైన కూడా ఆధార్‌ నెంబరు రాయాల్సిందే. ఈ నిబంధనలన్నీజూన్‌ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టుగా కేంద్ర రెవెన్యూ శాఖ పేర్కొంది.

ఇప్పటికే ఖాతాలు ఉన్నవారంతా డిసెంబరు 31లోగా ఆధార్‌, పాన్‌లను సమర్పించాలి. ఒకవేళ ఆధార్‌ లేకుంటే దరఖాస్తు చేసుకుని, దరఖాస్తు చేసిన ఆధారాలను సమర్పించాలి. తర్వాత ఆరు నెలల్లోగా ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేస్కోవాలి. అలాగే ప్రస్తుతం ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలకీ డిసెంబరు 31లోగా ఆధార్‌ నంబరుని జత చెయ్యాలి. ఆధార్ నెంబర్ అనుసంధానం చేయకపోతే ఆ ఖాతాలను నిలిపివేస్తామని ప్రకటించారు . కాబట్టి వెంటనే మన ఖాతాలకు ఆధార్ నంబర్ ని జత చేసి మంచి పౌరులమని నిరూపించుకుందాం.

(Visited 158 times, 63 visits today)

Comments

comments