EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Latest Alajadi / ఆధార్‌ చట్టబద్ధతపై సుప్రీం సంచలన తీర్పు

ఆధార్‌ చట్టబద్ధతపై సుప్రీం సంచలన తీర్పు

Author:

ఆధార్‌ జాతీయ గుర్తింపు కార్డు అని, దీనితో సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు కార్డు లభించిందని, దాని వల్ల వారికి సాధికారిత వచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రి అన్నారు. ఆధార్‌ కార్డు రాజ్యాంగబద్ధమైనదని స్పష్టంచేశారు. ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు నేడు తీర్పు వెలువరించింది.

ఈ అంశంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరపగా జస్టిస్‌ ఏకే సిక్రి మెజార్టీ తీర్పును చదివి వినిపించారు. ఆధార్‌తో నకిలీల సమస్య తొలిగిపోయిందని, మరోసారి ఆధార్‌ నమోదుకు వెళ్తే కంప్యూటర్‌ గుర్తిస్తుందని, ఇదే ఆధార్‌ను ప్రత్యేక గుర్తింపుగా చెప్పడానికి కారణం అని ఆయన పేర్కొన్నారు. ఆధార్‌ నమోదుకు ప్రజల నుంచి సాధ్యమైనంత కనీస సమాచారం మాత్రమే తీసుకున్నారని, ఇది పౌరులకు ఏకైక గుర్తింపు కార్డును అందజేసిందని సిక్రి వెల్లడించారు.

aadhaar-verdict-supreme-court-upholds-validity-of-aadhaar

సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పు వివరాలు…

 • వ్యక్తిగత స్వేచ్చకు ఆధార్‌ అవరోధం కాదు
 • ఆధార్‌ అధికారిక ప్రక్రియను, వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచాలి
 • ప్రభుత్వ సంస్థలు ఆధార్‌ డేటా షేర్‌ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి
 • షేర్‌ చేసిన డేటాను ఆరు నెలల లోపు తొలగించాలి
 • ప్రైవేట్‌ సంస్థలకు ఆధార్‌ డేటా ఇవ్వడం కుదరదు
 • ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఇతరుల చేతిలోకి వెళ్లకుండా చూడాలి
 • సమాచార భద్రత కోసం చట్టం తీసుకురావాలి
 • ఆధార్‌ ప్రక్రియ స్వచ్ఛందంగా కొనసాగాలి
 • టెలికాం కంపెనీలు ఆధార్‌ అడగవద్దు
 • స్కూల్‌ అడ్మినిషన్లకు ఆధార్‌ తప్పనిసరి కాదు
 • పాన్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులకు మాత్రం ఆధార్‌ కచ్చితంగా కావాలి.
 • బ్యాంక్‌ సేవలకు ఆధార్‌ లింక్‌ తప్పనిసరి కాదు

బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ తప్పనిసరి కాదు

బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని నేడు సుప్రీంకోర్టు వెల్లడించింది. అలాగే మొబైల్‌ కనెక్షన్లకు కూడా అవసరం లేదని చెప్పింది. పాఠశాల అడ్మిషన్లకు, సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీ పరీక్షలకు హాజరవ్వడానికి కూడా ఆధార్‌ తప్పనిసరి కాదని కోర్టు స్పష్టంచేసింది. కాగా ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్‌ చేయడానికి, పాన్‌ కార్డు నమోదు చేసుకోవడానికి ఆధార్‌ కార్డు తప్పకుండా ఉండాలని కోర్టు వెల్లడించింది.

(Visited 1 times, 480 visits today)