Home / Entertainment / అదిరిపోయిన ‘అభినేత్రి’ ట్రైలర్.

అదిరిపోయిన ‘అభినేత్రి’ ట్రైలర్.

Author:

ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా,మిల్కి బ్యూటీ తమన్నా జంటగా విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అభినేత్రి. ఈ సినిమాని తెలుగులో కోన ఫిలిం కార్పొరేషన్, బి.ఎల్. ఎన్ సినిమాతో కలసి కోన నిర్మిస్తున్నాడు. తమిళ్, హిందీ భాషల్లో  ప్రభుదేవా స్టూడియో పతాకంపై ప్రభుదేవా నిర్మిస్తున్నాడు.


ఈ చిత్రం యొక్క ట్రైలర్ మూడు భాషలలో విడుదల చేశారు. ఈ సినిమా ఒకవైపు భయపెడుతూనే మరో వైపు నవ్విస్తుంది. నవ్వుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఏడిపిస్తుంది అంటున్నాడు ఈ చిత్ర హీరో, నిర్మాత అయినా ప్రభుదేవా. విడుదల చేసిన ట్రైలర్ లో తమన్నా యాక్టింగ్ సూపర్. పల్లెటూరి నుండి వచ్చిన, తనలోకి హీరోయిన్ కావాలి అనుకోని చనిపోయిన అమ్మాయి ఆత్మ  చేరి చివరకు ఏ విధంగా హీరోయిన్ అయింది అనేది కథతో వస్తున్న చిత్రం. 70 కోట్లు ఖర్చు పెట్టి మూడు భాషలలో తీస్తున్నారు. ఈ సినిమా చాలా ముఖ్యమైన పాత్రలో సోనూసూద్ నటించాడు.ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

Comments

comments