Home / Entertainment / ఒక సినిమా విజయానికి కథే కారణం-నిఖిల్

ఒక సినిమా విజయానికి కథే కారణం-నిఖిల్

Author:

Hero Nikhil Interview

నిఖిల్ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన కుర్రడు మనోడి తల్లితండ్రులకు స్కుల్స్ ఉన్నాయి.నిఖిల్ మొదట హైద్రబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు.హాపీడేస్ చిత్రం లో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశారు ఈ “హాపీ డేస్” చిత్రం భారతదేశం లో విడుదల కంటే ముందుగా టాలీవుడ్ లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించారు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హాపీడేస్ చిత్రం నిలిచింది. ఆయన మొదటి సోలో చిత్రం అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్. అతడు యువత మరియు వీడు తేడా చిత్రాలలో నటించాడు.తర్వాత కోన్ని సినిమాలు బొల్త కొట్టడం తో మనోడు కాస్తా రూట్ మార్చి కథల ఎంపికల జగ్రత్త వహించాడు.అలా మొదటగ స్వామి రారా,కార్తికేయ,సూర్య వ్స్ సూర్య ఇలా వరుసగా హట్రిక్ హీట్స్ ఇచ్చాడు.ఇప్పుడు శంకరాభరణం అంటు వస్తున్నాడు.

నిఖిల్ మాట్లాడుతు..నాకు ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేదు. అందుకే నా తప్పులని నేనే తెలుసుకొని కరెక్ట్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది, అలాగే ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూస్తారు అనే రీసర్చ్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక్కోసారి పెద్ద బ్యానర్ అని, ఒక్కోసారి ఆబ్లిగేషన్ మీద సినిమాలు చేస్తాం. ఒక సినిమా విజయానికి కథే కారణం, కథ బాగుంటేనే సినిమా ఆడుతుంది అని రియలైజ్ అయ్యాను. సో కథ బాగుంటేనే సినిమా చెయ్యాలని ఫిక్స్ అయిపోయాను. నా మొదటి టార్గెట్ ఒక్కటే.. సినిమా సినిమాకి పోల్చుకుంటే కథ మరియు నిఖిల్ పాత్ర కొత్తగా ఉండాలి, అక్కడి నుంచి ఎంత రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా, స్టార్ డైరెక్టర్ అయినా, స్టార్ ప్రొడక్షన్ బ్యానర్ అయినా.. ఇలా ఎవరు ఎంత టెంప్ట్ చేసినా కథ నచ్చితేనే సినిమా చెయ్యాలనే రూల్ ని పెట్టుకొని దాన్నే ఫాలో అయిపోతున్నాను. ఒక్కటే అండీ నేను ఓకే చెప్తే కథ బాగుండాలి, అలాగే నాకు నటుడిగా సంతృప్తి ఇచ్చేలా ఉండాలి. ఇక అది హిట్టా ఫట్టా అన్నది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే .కథ నాకు బాగా నచ్చింది. ఇంకా డెవలప్ చేసి చెప్తానని రెండోసారి చెప్పినప్పుడు నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమాలో ఓ డిఫరెంట్ పాయింట్ తో పాటు, సినిమా స్టార్ట్ టు ఎండ్ నవ్వుకునేలా ఉంటుంది. అలా అని కోన గారి గత సినిమాలా టెంప్లెట్ లో అయితే అస్సలు ఉండదు. ఇలాంటి ఓ కమర్షియల్ కాన్సెప్ట్ ని నా కెరీర్లో ఇప్పటి వరకూ చేయలేదు. సినిమా సూపర్, డూపర్, కేవ్వుకేక అని ముందే చెప్పదలచుకోలేదు.. కానీ ఒకటి గ్యారంటీ ఇస్తాను., ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసివెళ్ళి బాగా ఎంజాయ్ చేసి, నవ్వుకుంటూ బయటకి వచ్చే సినిమానే ‘శంకరాభరణం’.

ఈ సినిమా తర్వాత విఐ ఆనంద్ డైరెక్షన్ లో నెక్స్ట్ మూవీ చేస్తున్నాను. అది ఫాంటసీ హర్రర్ థ్రిల్లర్ జానర్లో ఉంటుంది. ఫిబ్రవరిలో కార్తీక్ రెడ్డి డైరెక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా ఉంటుంది. ఆ సినిమా తర్వాత చందూ మొండేటితో కలిసి ‘కార్తికేయ 2’ చేయనున్నాను. ఈ మూడు సినిమాలు కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి.

(Visited 91 times, 18 visits today)