Home / Entertainment / “జన గణ మన ” తర్వాత N .T .R తో నేతాజీ అంటున్న పూరీ.

“జన గణ మన ” తర్వాత N .T .R తో నేతాజీ అంటున్న పూరీ.

Author:

పూరీకీ వరుస సినిమాల దర్శకుడిగా మంచి పేరుంది, అలానే పంచ్ డైలాగులు కమర్షియల్ హిట్లు పూరీకి టేక్ తో పెట్టిన విద్య. పోకిరి, దేశముదురు, చిరుత తో అప్పట్లో హట్రిక్ హిట్ కొట్టి మొత్తం తెలుగు ఇండస్ట్రీలోనే భారీ పారితోషకం కూడా తీసుకున్నాడు. కానీ ఈ మధ్యనే గత గొంతకాలంగా పూరీ సీన్ రివర్స్ అయ్యింది అసలు ఏం పట్టుకున్నా తేడా కొడుతుంది. పూరీ బాషలోనే చెప్పాలంటే “ఎవడు సినిమా తీస్తే బయ్యర్లు ఆస్తులమ్ముకుంటారో వాడే పూరీ ” అన్నట్టు అయ్యింది ప్రెజెంట్ ఈ బడా దర్శకుని పరిస్తితి. ఇటీవల జ్యోతిలక్ష్మి అంటూ చార్మీతో ప్రయోగం చేసి, నాగబాబు కొడుకు మెగా హీరోని లోఫర్ ని చేసి ఫ్లాప్ లని మూట కట్టుకోవటమే కాక బయ్యర్లకి కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చాడు. ఇక ఇలాంటి పరాజయాలని చూసి ఈ పంచ్ డైలాగుల డైరెక్టర్ ఏమనుకున్నాడో ఏమో వరసగా పెద్ద హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడట.

Ntr and Puri Jaganath Nethaji

మహేష్ బాబు తో “జన గణ మన” అనే సినిమా పోస్టర్ ని సామాజిక మాధ్యమాల వేదికగా ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసినదే, కాగా ఇది పూర్తి అయిన వెంటనే జూనియర్.ఎన్టీఆర్ తో “నేతాజీ “అనే సినిమా ప్లాన్లో ఉన్నట్టు, అంతే కాకుండా వెంకటేష్ 75వ సినిమాని కూడా పూరినే తెరకెక్కిస్తున్నాడట, కళ్యాణ్ రామ్  తో కూడా మరో సినిమా ప్లాన్ చేయబోతున్నాడు .

పూరి ఒక సినిమా తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవటం అతని కెరీర్ గాడిలో పడ్డాక ఇదే తొలిసారి, ఈ స్క్రిప్ట్ లు అన్నింటి పై పక్కా వర్క్ కోసమే పూరీ ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్టూ, మిగతా విషయాలు అన్నీ ఓకే కానీ ఎన్టీఆర్ సినిమా మాత్రం ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. తనకి టెంపర్ వంటి హిట్ ఇచ్చిన పూరీ సినిమా అంటే ఎన్టీఆర్ కాదనే సమస్యే లేదని ఇండస్ట్రీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఏమైనా ప్రస్తుతం ఫ్లాప్ లలో ఉన్న పూరీ కి వరస హిట్లు వచ్చేస్తే బాగుండు, త్వరత్వరగా సినిమాలు అవగొట్టే డైరెక్టర్ కాబట్టి అటు నిర్మాతలు, బయ్యర్లూ, ఇండస్ట్రీ, మొత్తానికీ హ్యాపీ కదా ………

(Visited 230 times, 36 visits today)