Home / Entertainment / వివాదంలో అజ్ఞాతవాసి…? ఫ్రెంచ్ సినిమాని కాపీ చేసినట్లు నోటీసులు..!

వివాదంలో అజ్ఞాతవాసి…? ఫ్రెంచ్ సినిమాని కాపీ చేసినట్లు నోటీసులు..!

Author:

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఖుష్బూ, ఆది పినిశెట్టి, కీర్తి సురేష్ ముఖ్య పాత్రధారులుగా వస్తున్న సినిమా అజ్ఞాతవాసి, ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 10 న విడుదల కాబోతుంది, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన పాటలు ఇప్పటికే సినిమాపై అంచనాలని భారీగా పెంచేసాయి. న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసిన పవన్ కళ్యాణ్ పాడిన పాట సూపర్ డూపర్ హిట్ అయింది.

అజ్ఞాతవాసి

సినిమాపై భారీ అంచనాలు పెట్టుకొని అభిమానులు ఎదురుచూస్తుండగా అజ్ఞాతవాసి నిర్మాతలకు లీగల్‌ నోటీసులు అందాయని తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన ‘అజ్ఞాతవాసి’ టీజర్‌ కాన్సెప్ట్‌ను చూస్తుంటే ఫ్రెంచ్‌ హిట్‌ చిత్రం ‘లార్గో విన్చ్‌’ను కాపీ చేసినట్లు తెలుస్తోందని వార్తలు వచ్చాయి. ‘లార్గో విన్స్‌’ రీమేక్‌ హక్కులను బాలీవుడ్ కి చెందిన టీ-సిరీస్‌ సొంతం చేసుకుందని, ‘అజ్ఞాతవాసి’ కథపై జరుగుతున్న ప్రచారం తెలుసుకున్న ఆ సంస్థ నిర్మాతలు పవన్‌ సినిమా నిర్మాతల్ని కలిశారని చెప్పుకొచ్చారు. కాపీరైట్‌ ఉల్లంఘనపై వివరణ ఇవ్వమని కోరారని రాసుకొచ్చారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి బాలీవుడ్ లో మంచి పరిచయాలున్న దగ్గుబాటి రానా రంగంలోకి దిగినట్లుగా సమాచారం.

అయితే, ఈ మేరకు ఓ ప్రముఖ పత్రికలో ఈ వార్తను చూసిన ‘లార్గో విన్చ్‌’ దర్శకుడు జెరోమి సలే ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా టికెట్‌ కొంటానని అన్నారు. ఈ సినిమా చూడాలని ఆసక్తిగా ఉందని చెప్పారు. దీంతోపాటు ‘లార్గో విన్చ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. అయితే కాపీరైట్‌ వివాదంపై ఇప్పటివరకూ ‘అజ్ఞాతవాసి’ చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

(Visited 207 times, 39 visits today)