EDITION English తెలుగు
ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?   ఆరోగ్యం,భోజ‌నం, చ‌దువు, అంతా…..ఈ వాత్స‌ల్యం సంస్థే అండ‌గా నిల‌బ‌డ‌తుది   'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌

అఖిల్ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు.

Author:

అక్కినేని ఫ్యామిలీలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు వస్తున్న అక్కినేని అఖిల్ తన సొంత పేరుతోనే వస్తున్న విషయం తెలిసిందే.  ‘ అఖిల్ ’ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తున్నారు. హీరో నితిన్ ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే భారీ అంచనాలతో క్రేజీ సినిమాగా నిలిచిన ‘అఖిల్’, ఈ మధ్యే విడుదలైన టీజర్‌తో ఎక్కడికో వెళ్ళిపోయింది. బాలీవుడ్ హీరోలకి ధీటుగా తన చార్మింగ్ లుక్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు ఈ అక్కినేని యువ హీరో. పోస్టర్లోనూ, టీజర్ లోనూ అక్కినేని వారసుడిని చూసిన వారంతా మరో స్టార్ రాబోతున్నాడంటూ కితాబిచ్చేసారు. ఇప్పటికే బిజినెస్ పరంగా దూసుకెల్తున్నాడు అఖిల్. ఇప్పటికే బండ్ల గణేష్ అఖిల్ రెండో సినిమా తనే నిర్మించాలనే ప్రయత్నాల్లోనే ఉన్నాడట. ఇప్పటికే అఖిల్ ఈ సినిమాకి డేట్స్ ఇచ్చేసాడని కూడా అనుకుంటున్నారు. డైరెక్టర్ కూడా శ్రీమంతుడు సినిమాతో సక్సెస్ లో ఉన్న కొరటాల శివ అయుండొచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ‘అఖిల్’ అన్ని విధాలా క్రేజీ సినిమాగా నిలవడంతో ఈ సినిమా విషయంలో ప్రతిదీ గ్రాండ్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకూడదనీ, ఇప్పటికి ఏర్పడిన క్రేజ్ ని ఏ మాత్రం తగ్గించాలనుకోవటం లేదట.  అందుకు తగ్గట్టుగానే ఇప్పటి వరకూ పలు అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరిపారు. ఆస్ట్రియా, స్పెయిన్‌లోని పలు అందమైన లొకేషన్స్‌లో కొన్ని రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఆస్ట్రేలియాలో కూడా స్టెప్పులేసిన అఖిల్ తన సినిమా పాటలు ఈ నెల (సెప్టెంబర్) 20 న విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియ జేసాడు. తమన్ ,అనూప్ రూబెన్స్ కలిసి సమ కూర్చిన సంగీతం అభిమానులని కట్టి పడేసే లానే ఉందట. సెప్టెంబర్ 20 న రెలీజయ్యే అఖిల్ ని వినటానికి అంతా ఆసక్తి గానే ఎదురు చూస్తున్నారు.   ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే ఒక అపూర్వ
శక్తులున్న బంతి చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ ద్వారా కొంత హింట్ ఇచ్చేసారు కూడా.

(Visited 45 times, 15 visits today)