Home / Entertainment / అఖిల్ రాక ని పక్కా గా చెప్పిన నాగార్జున.

అఖిల్ రాక ని పక్కా గా చెప్పిన నాగార్జున.

Author:

Akhil Movie Release date Details

నటవారసుడే అయినా తోలి సినిమా రిలీజ్ కి ముందే తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకొని మార్కెట్ ని సృష్టించుకున్న యువ హీరో అఖిల్. మొదటి సినిమా నే బ్లాక్ బస్టర్ హిట్ ఐపోయింది అన్నంత కాన్ఫిడెన్స్ తో వస్తున్న సినిమా తన సొంత పేరుతోనే రావటం టాలివుడ్ లో అతని కి ఉండ బోయే చరిష్మాని చెప్పకనే చెబుతోంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న రెండో వారసుడి మొదటి సినిమా ఇది. ఇప్పుడు ‘అఖిల్’ అన్ని విధాలా క్రేజీ సినిమాగా నిలవడంతో ఈ సినిమా విషయంలో ప్రతిదీ గ్రాండ్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకూడదనీ, ఇప్పటికి ఏర్పడిన క్రేజ్ ని ఏ మాత్రం తగ్గించాలనుకోవటం లేదట. అందుకు తగ్గట్టుగానే ఇప్పటి వరకూ పలు అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరిపారు. ఆస్ట్రియా, స్పెయిన్‌లోని పలు అందమైన లొకేషన్స్‌లో కొన్ని రోజుల పాటు షూటింగ్ జరిగింది.

ఒక అపూర్వ శక్తులున్న బంతి చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. తన పేరునే తన మొదటి సినిమా టైటిల్ గా వస్తున్న ఈ హీరో సినిమా”అఖిల్” దసరా కానుకగా రిలీజ్ అయ్యి ఉండాలి. కానీ విఎఫ్ఎక్స్ విషయంలో ఈ చిత్ర టీం పూర్తి సంతృప్తికరంగా లేకపోవడం వలన సినిమాని వాయిదావేసారు. ఇక అప్పటి నుంచీ అఖిల్ పై రీ షూట్ జరుగుతుందని ఇప్పట్లో రిలీజ్ ఉండదనీ, సినిమా క్రిస్మస్ కి వస్తుందనే పలు రకాల ప్రచారాలు జరిగాయి. ఈ చిత్ర నిర్మాత అయిన నితిన్ దర్శకుడు వినాయక్ లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు కూడా. కానీ అవన్నీ నిజం కాదని, విఎఫ్ ఎక్స్ వర్క్ ఫైనల్ స్టేజ్ లోఉందని త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని.రీసెంట్ గా …తన సినిమా పనుల గురించి ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు వివరించాడు.

కారణాలు ఏవైనప్పటికీ ఈ సినిమా దసరా రేసులో నిలవలేకపోయింది. ఇక వాయిదా పడినప్పట్నుంచే ఈ సినిమాపై రిలీజ్‌పై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. సినిమా డిసెంబర్ నెలకు వెళ్ళిపోయిందని, నవంబర్ నెలాఖర్లో విడుదవుతుందని ఇలా రకరకాల అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇక ఎట్టకేలకు కింగ్ నాగార్జున అఖిల్ సినిమా తాజా రిలీజ్ డేట్‌ను ప్రకటించేసి అభిమానులకు క్లారిటీ ఇచ్చేశారు. దీపావలికే విదుదల అని పోయిన వారమే అనుకూఅన్నా అది పక్కా అని మాత్రం చెప్పలేక పోయారు ఐతే ఈ సంధిగ్ధాలన్నిటికీ తెర దించుతూ. దీపావళి కానుకగా నవంబర్ 11న అఖిల్ సినిమా విడుదల కానుందని నాగార్జున కొద్దిసేపటి క్రితం స్పష్టం చేశారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో హీరో నితిన్ నిర్మించారు.

(Visited 42 times, 9 visits today)