EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

‘రోబో 2.0’ లో విలన్‌గా బాలీవుడ్ స్టార్!

Author:
Source: Akshay Facebook

Source: Akshay Facebook

సంచలన డైరెక్టర్ శంకర్‌, సూపర్ స్టార్ రజనీ కాంత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ అనే సినిమా దేశవ్యాప్తంగా ఏ స్థాయి ప్రభంజనాన్ని సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా రూపొందే ‘రోబో 2’ అంతకు ఎన్నో రెట్లు మించిపోయేలా ఉండేలా శంకర్ భారీ ప్లాన్స్ చేస్తున్నారు. ఫస్ట్‌ పార్టులో సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబో చిట్టి.. ఈసారి ఆడ చిట్టీగా రాబోతోంది. ఈ పాత్రను వెరైటీగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫీమేల్ చిట్టి ఎవరితో పరిచయం పెంచుకుంది. అందుకు తగ్గట్లుగానే ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందే సినిమా అంటూ ‘రోబో 2’కు ప్రచారం కల్పించారు. నిన్నట్నుంచే అధికారికంగా సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమాలో రజనీ కాంత్‌కి విలన్‌గా ఎవరు నటిస్తారన్న విషయం గత మూడు నెలలుగా చర్చనీయాశంగా నిలిచింది. చివరకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ను ఎంపిక చేసి శంకర్ అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇప్పటివరకూ ‘రోబో 2’ విలన్ విషయమై ఎన్నో పేర్లు వినిపించినా,చివరకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ను వరించింది. ముందు హాలీవుడ్ మెగా హీరో అర్నాల్డ్ ష్వాజ్‌నెగర్‌ను అనుకున్నారు. తర్వాత ఆమిర్‌ను కూడా సంప్రదించారు. చివరికి బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ ను ఫిక్స్ చేసేశారు. ఆ విషయాన్ని స్వయంగా అక్షయ్ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు. రజనీకాంత్ గారితో సినిమా ప్రారంభంతో ఈ సంవత్సరం ముగియడం చాలా సంతోషంగా ఉందంటూ ఒక ఫొటోను షేర్ చేశారు. రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా బాహుబలి ఫేం శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు. హాలీవుడ్ సంస్థ మేరీ ఈ వోగ్ట్ కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయనుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది దర్శక నిర్మాతల ప్లాన్.

(Visited 73 times, 29 visits today)

Comments

comments