EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Entertainment / పవర్ స్టార్,సూపర్ స్టార్ లను దాటేసినా అల్లు అర్జున్.

పవర్ స్టార్,సూపర్ స్టార్ లను దాటేసినా అల్లు అర్జున్.

Author:

Allu Arjun Pawan Kalyan Mahesh Babu

పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. ఎన్టీఆర్ వంటి నెంబర్ 1 రేస్ లో ఉన్న సూపర్ స్టార్లకు కూడా సాధ్యం కాని రికార్డ్లను సొంతం చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే నైజాం ఏరియాలో వరుసగా ఆరు సినిమాలతో రూ.10 కోట్ల షేర్ సాధించిన ఒకే ఒక్క హీరోగా రికార్డు సృష్టించాడు బన్నీ. ఇప్పుడిక ఇంకో రికార్డు అతడి ఖాతా లో పడిపోయింది . చివరి 4 సినిమాలలో రూ.50 కోట్ల షేర్ మార్కును చేరుకున్నాడు.టాలీవుడ్ లో మరే హీరో ఈ రికార్డు సమం చేయలేదు సరికదా కనీసం 3 సార్లు కూడా చేరుకోలేదు దానితో బన్నీ ఫాన్స్ “బన్నీ నా మజాకా ” అని ఫుల్ ఖుషీ లో ఉన్నారు .

కలక్షన్ల పరంగా గా ఒక మాదిరిగా సాగే అల్లు వారి అబ్బాయి కెరీర్ ‘రేసుగుర్రం’ సినిమాతో ఊపు అందుకుంది , తొలిసారి రూ.50 కోట్ల షేర్ మార్కును టచ్ చేశాడు బన్నీ. ఆ సినిమా ఫుల్ రన్లో రూ.60 కోట్ల దాకా వసూలు చేసింది. ఆ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’ డివైడ్ టాక్ ని తట్టుకుని మరీ రూ.55 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది.

బన్నీ గోన గన్నారెడ్డిగా స్పెషల్ గెట్ అప్ వేసిన ‘రుద్రమదేవి’ సైతం 50 కోట్ల మార్కును టచ్ చేసింది. ఇప్పుడు ‘సరైనోడు’ కూడా ఈ క్లబ్బులో చేరింది. మిగతా మూడు సినిమాల కంటే చాలా వేగంగా ‘సరైనోడు’ ఈ మార్క్ ని చేరుకుంది . బొమ్మ పడీ రెండు వారాలు అవ్వక ముందే ‘సరైనోడు’ వరల్డ్ వైడ్ షేర్ రూ.50 కోట్ల మార్కును అందుకోవడం చెప్పుకోవాల్సిన విషయమే . రెండో వీకెండ్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో బన్నీ ఈ సీజన్లో బాక్సాఫీస్ కు సరైనోడు అన్నట్టుంది . ఈ మూవీ ఫుల్ రన్లో రూ.60 కోట్ల పైనే షేర్ చేస్తుందని మూవీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి . డివైడ్ టాక్ తో మొదలైన సినిమా ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమే.

Comments

comments