Home / Entertainment / ఒక మనసు ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడిన అల్లు అర్జున్.

ఒక మనసు ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడిన అల్లు అర్జున్.

Author:

పవన్ కల్యాణ్ గురించి “చెప్పను బ్రదర్” అని అల్లు అర్జున్ అన్న డైలాగ్ తో మెగా ఫ్యాన్స్ గ్రూపులుగా విడిపోయేదాకా వచ్చారు. కొంతమంది పవన్ ఫ్యాన్స్ ఐతే అల్లు అర్జున్ కి కళ్ళు నెత్తిమీదకు ఎక్కాయని, వరుస హిట్లు రావడంతో పవన్ ని లెక్క చేయడం లేదంటూ సోషియల్ మీడియా లో పిచ్చి పిచ్చిగా కామెంట్ లు చేశారు. ఇక పరిస్థితి చేయిదాటుతుండడంతో అల్లు అర్జున్ తన మనసులోని మాటను, ఆ డైలాగ్ ఎందుకు అనాల్సి వచ్చిందో ఈ రోజు జరిగిన ఒక మనసు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో తెలిపారు.

allu arjun on pawan kalyan

తనకు, మెగా ఫ్యామిలీకి పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం అని, కొంత మంది పవన్ కల్యాణ్ అభిమానుల వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుందని తెలిపాడు. ఏ హీరో ఫంక్షన్ అయిన ఆ కొంత మంది పవన్ అభిమానులు పవర్ స్టార్ అని అరుస్తూ మొత్తం ఫంక్షన్ ని డిస్టర్బ్ చేస్తున్నారని అది మంచి పద్దతి కాదని, ఇక ముందు అలా చేయవద్దని కూడా పవన్ ఫ్యాన్స్ కి సూచించారు. ఇలా డిస్టర్బ్ చేయడం వల్లనే ఒక హీరో అల్లు అర్జున్ కి కంప్లేన్ చేసాడని, దాని వల్ల తనకు చాలా భాధ కలిగిందని, అందుకే ఇంతకు ముందు ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ గురించి చెప్పలేదని వివరణ ఇచ్చారు. ఈ వివరణ తో పవన్ ఫ్యాన్స్ ఏకీభవిస్తారో లేదో చూడాలి.

Must Read: లీకైన గౌతమిపుత్ర శాతకర్ణి లొకేషన్ ఫొటోస్.

(Visited 4,126 times, 37 visits today)