EDITION English తెలుగు
Video: సినిమాలకు ఇక సెలవు : పవన్ కల్యాణ్.   ఇక వాట్సాప్ లో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు.   హైదరాబాద్ నగరం అసలు పేరు ‘ చిచులం ’, ఇదే నిజమైన పేరు, ఈ విషయం చాలామందికి తెలియదని చారిత్రక పరిశోధకుడు పాండులింగారెడ్డి తెలిపారు.   స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.   షాకింగ్ న్యూస్: మూతపడిన ట్రంప్ ప్రభుత్వం, సంక్షోభంలో అమెరికా...!   Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.   క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి.. సాయం అందించాలనుకునే వారు అకౌంట్ నం. 80808080101026419 లో డబ్బులు వేయండి.   డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!   Video:స్కూల్ కి పది నిముషాలు లేట్ గా వచ్చాడని.. బాతులా నడిపించి..బలి తీసుకున్నారు.   పెద్ద పెద్ద క్రేన్లు ఆ హనుమాన్ విగ్రహాన్ని ఇంచుకూడా కదలించలేక పోయాయి.
Home / Entertainment / అమెరికా అబ్బాయిగా రానున్న అందాల రాముడు.

అమెరికా అబ్బాయిగా రానున్న అందాల రాముడు.

Author:

తన హావభావాలతో, అద్భుతమైన డాన్స్‌లతో మాస్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సునీల్ కమేడియన్ గానే కాదు హీరో గా కూడా మంచి మార్కులే వేయించుకున్నాడు. ఈనవ్వుల నటుడు. అందాల రాముడు తర్వాత ఇంత లావుగా ఉన్న ఇతనికి ఒకటిరెండు తప్ప ఎం సినిమాలు వస్తాయ్ అనిపించుకున్న సునీల్. స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తో కూడా శబ్బాష్ అనిపించుకున్నాడు. పూలరంగడు తో సిక్స్ ప్యాక్ బాడీతో ప్రత్యక్షమయ్యాడు, మిస్టర్ పెళ్ళికొడుకు లో పక్కా యూత్ స్టైల్ తొ కనిపించాడు ఇలా తనను తాను ప్రతీ సినిమాకీ ఇంప్రూవ్ చేసుకున్న ఈ హీరో. ఇప్పుడు ‘కృష్ణాష్టమి’ పేరుతో ఒక సరికొత్త ఫామిలీ ఎంటర్టైనర్‌ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

వాసు వర్మ దర్శకత్వం లో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణం లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ స్వాంతంత్ర దినోత్సవం  సందర్భం గా విడుదలైన విషయం తెలిసిందే. నిక్కి గల్రాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించగా, ప్రముఖ రచయిత కోనా వెంకట్ కథ ను సమకూర్చారు. ఈ సినిమా చక్కటి ఫామిలీ ఎంటర్టైనర్గా రానున్నట్టూ, ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం గా రూపుదిద్దుకుంటోందట కృష్ణాష్టమి .

సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫ్యామిలీ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయంటున్నారు యునిట్ సభ్యులు. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనే పాయింట్ నే చక్కని కామెడీతో కలిపి కథని తయారు చేసారట కోనా వెంకట్. అమెరికా అబ్బాయిగా సునీల్ ఎలా మెప్పిస్తాడూ ఎలా ప్రేక్షకులని అలరిస్తాడూ అనేది తెరపై చూడాల్సిందే. సునీల్ , నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్నారు  ఈ చిత్రంలో. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంగీతం దినేష్  అందిస్తున్నాడు, ఛాయగ్రహణం చోట కె నాయుడు .

Comments

comments