EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

అమీతుమీ రివ్యూ & రేటింగ్.

ami tumi movie review

Alajadi Rating

2.75/5.0

Cast: శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, అడ‌వి శేష్‌, ఈషా, అదితి, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల‌కిషోర్ త‌దిత‌రులు

Directed by: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి

Produced by: కె.సి. న‌ర‌సింహారావు, విన‌య్‌

Banner: ఎ గ్రీన్ ట్రీ ప్రొడ‌క్ష‌న్స్‌

Music Composed by: మ‌ణిశ‌ర్మ‌

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి .. అచ్చతెలుగు సినిమాలు రూపొందించే తెలుగు దర్శకుడు. అష్టాచ‌మ్మాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇతను, విభిన్న కథలతో వైవిద్యమున్న సినిమాలు తెరకేక్కిస్తున్నాడు. చక్కటి, అశ్లీలం లేని వినోదం ఆయ‌న సినిమాల్లో క‌నిపిస్తుంటుంది. జెంటిల్‌మెన్‌లాంటి ఓ హిట్టు త‌ర్వాత ఆయ‌న తన అష్టాచ‌మ్మా హీరో అవసరాల, క్షణం తో హిట్టు కొట్టిన అడవి శేష్ లతో అమీతుమీ మొదలెట్టడంతో మూవీ పై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పైగా ఈ ఇద్దరు హీరోలతో పాటూ.. వెన్నెల కిషోర్, త‌నికెళ్ల భ‌ర‌ణిలు కూడా ఉండడం మరిన్ని అంచనాలు పెంచింది. గమ్మత్తేంటంటే.. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి దర్శకత్వం లో నటిస్తున్న అవ‌స‌రాల శ్రీనివాస్‌, అడ‌వి  శేష్‌, వెన్నెల‌కిషోర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణిలు అందరూ దర్శకులే కావడం ఇంట్రస్టింగ్. మరి ఇన్ని స్పెషల్ పాయింట్స్ ఉన్న సినిమా అమీతుమీలో అసలు వినోదం పండిందా? .. లేక కాయేనా అన్నది చూద్దాం.

కథ :

జ‌నార్ధ‌న్ (త‌నికెళ్ల భ‌ర‌ణి)కి ఇద్దరు పిల్లలు. కూతురు  దీపిక (ఈషా), కొడుకు విజ‌య్ (అవ‌స‌రాల శ్రీనివాస్‌). ఇద్దరూ తనకు నచ్చిన వాళ్ళనే పెళ్లి చేస్కోవాలన్నది తండ్రి కోరిక. కానీ కూతురు  దీపిక, అనంత్ (అడ‌వి  శేష్‌)ని ప్రేమిస్తుంది. తండ్రి మాత్రం  కూతురిని  బాగా డ‌బ్బున్న శ్రీ చిలిపి (వెన్నెల‌కిషోర్‌)కి ఇచ్చి పెళ్లి చేయాల‌ని చూస్తుంటాడు. ఇక కొడుకు విజ‌య్ కూడా మాయ (అదితి) అనే అమ్మాయి  ప్రేమలో పడతాడు అయితే ఇక్కడా ఒక ట్విస్టు. మాయ తండ్రితో ఉన్న గొడ‌వ‌ల కారణంగా వీరి పెళ్లికి కూడా నో అంటాడు తండ్రి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూతురు, కొడుకుల పెళ్ళిళ్లు త‌న‌కి ఇష్ట‌మైన వాళ్ల‌తోనే జ‌రిపించాల‌నే ప‌ట్టుద‌లతో తండ్రి ప్లాన్ చేస్తుంటే, మరో వైపు ఇద్దరు పిల్లలు ఇంట్లోంచి లేచిపోయి అయినా సరే ప్రేమించిన వాళ్ళను పెల్లాడాలనే నిర్నయానికొస్తారు.

అయితే మాయ మాత్రం త‌న తండ్రి ఒప్పుకొంటేనే  పెళ్లి లేద్దంటే నో అని తెల్చేస్తుంది. ఇన్ని గొడవలు, కన్ ఫ్యూజన్ల మధ్యలో  శ్రీచిలిపి ఎంటర్ అవగానే కథ అనేక మలుపులు తిరుగుతుంది. రెండు ప్రేమ జంటలు తండ్రి మాటకు తలోగ్గాయా?వారి  ప్రేమలు గెలిచాయా? చివరికి అనంత్‌, విజ‌య్‌, శ్రీచిలిపిల పెళ్ళిళ్ళు ఎవరితో అయ్యాయి..అసలు  ప్రేమ‌జంటల క‌థ‌లు సుఖాంత‌మ‌య్యాయా?లేదా అనేవి మాత్రం టికెట్ కొనుక్కుని థియేటర్ కెళ్ళి చూస్తేనే బాగుంటుంది.

అలజడి విశ్లేషణ :

కథగా వింటే పాత కథే. అసలు ఇంట పాత కథని సినిమాగా తీయడం అంటే ఈ రోజుల్లో కష్టమే. కానీ ద‌ర్శ‌కుడు ఈ సినిమాని కూడా రెండు జంట‌ల ప్రేమ‌, పెళ్ళి త‌తంగం చుట్టూ  ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దాడు. సింపుల్ గా చెప్పాలంటే రెండు జంట‌ల ప్రేమ‌, ఒక సమస్య, పెళ్లిళ్ల నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. సినిమా స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగింది. ప్ర‌ధాన పాత్ర‌ల‌న్నీ తెలంగాణ యాస‌లో మాట్లాడ‌టం సినిమా స్పెషాలిటీ. సినిమా మొదట్లో స్లో గా అనిపించినప్పటికీ, వెన్నెల‌కిషోర్ పాత్ర ప్ర‌వేశంతో క‌థ ఊపందుకొంటుంది.  అప్ప‌టిదాకా ఉన్న ఫ‌న్ ఫ్లేవర్ కాస్త క‌న్‌ఫ్యూజ‌న్ డ్రామాని వైపు కదిలి ఆడియన్స్ కి ఇంట్రస్ట్ క్రియేటవుతుంది. మొత్తానికి ఒక చక్కటి తెలుగు హాస్య భరితమైన చిత్రం చూసిన అనుభూతి కలుగుతుంది.

నటీనటుల పనితీరు:

అందరూ తెలుగు న‌టులే ఉండడం ఈ సినిమా స్పెషాలిటి . అందరూ తమ తమ పరిదిలో ఆకట్టుకునే నటనతో చిత్రం ఆద్యంతం ఇంట్రస్టు క్రియేట్ చేసారు. ముఖ్యంగా అవ‌స‌రాల‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఈషాలు తెలంగాణ యాస‌లో డైలాగ్స్ చెప్పడం వెరీ ఇంట్రస్టింగ్. ఈ యాస బాగా వర్కవుటయింది.. వారి మాటలు, యాసతోనే ఫుల్ ఎంటర్ టైన్మెంట్ దొరికింది. ఇక య౦గ్ చాప్ అడ‌వి శేష్ కూడా రొమాంటిక్ పాత్ర‌లో జీవించాడు. అదితి, శ్యామ‌లాదేవిలు కథ, పాత్రల పరిధి మేరకు నటించారు. ఓవరాల్ గా అందరూ ఓకే.  వెన్నెల‌కిషోర్‌ అసిస్టెంట్ గా నటించిన తను మాత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. ఇక టెక్నికల్ గా చెప్పాలంటే ఇది పక్కా ద‌ర్శ‌కుడి చిత్రం. దర్శకుడు బౌండ్ స్క్రిప్ట్ తో పని చేసే టైపు కాబట్టి, పాత కథ అయినా ఇంట్రస్టు కలిగేలా తీర్చిదిద్దాడు.ఆయనకు అనుభవమున్న నటులు, పైగా వాళ్ళలో నలుగురూ దర్శకత్వం చేసిన అనుభవం ఉండడం సినిమాకు పనికొచ్చింది. దర్శకుడితో చాల కాలంగా పనిచేస్తోన్న చిన్న సినిమాల పెద్ద కెమరామెన్  పి.జి.విందా ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకి చాల ప్లస్సయింది. పాటల చిత్రీకరణ విషయం లో విందా పనితనం కనబడుతుంది. మణిశర్మ సంగీతం లోని పాటలు ఆల్రెడీ అందరి నోళ్ళల్లో నానుతున్నాయి. ఓవరాల్ గా అందరూ కలిసి ఒక చక్కటి తెలుగు సినిమాని అందించారు.

ప్లస్ పాయింట్లు:

  • స్క్రీన్ ప్లే
  • తెలంగాణ యాస డైలాగ్స్
  • కామెడీ
  • న‌టీన‌టులు

మైనస్ పాయింట్లు:

  • పాత కథ
  • అక్కడక్కడా ఇంగ్లీష్ డైలాగ్స్
  • ఫస్ట్ హాఫ్ స్లోగా ఉండడం
(Visited 487 times, 42 visits today)

Comments

comments