Home / Entertainment / రాష్ట్రపతిగా చేయడానికి ఒప్పుకున్నా అమితాబ్ బచ్చన్.

రాష్ట్రపతిగా చేయడానికి ఒప్పుకున్నా అమితాబ్ బచ్చన్.

Author:

మన దేశంలోనే ఎక్కువ మంది అభిమానులని సాధించుకున్న నటులలో బిగ్ బీ అమితాబ్ మొదటి స్థానంలో ఉంటారు, 74 ఏళ్ళ వయసులోనూ ఇప్పటి జెనరేషన్ నటులని మించిన నటనతో సినిమాలు చేస్తున్నారు, ఈ వయసులో కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు.

balakrishana-asked-amitabh-bachhan

రెండురోజుల క్రితం బాలకృష్ణ, అమితాబ్ బచ్చన్ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి, అయితే గౌతమి పుత్ర శాతకర్ణి తరువాత బాలకృష్ణ, కృష్ణ వంశీ డైరక్షన్ లో రైతు అనే సినిమా చేయబోతున్నాడు, ఈ సినిమాకి ఇప్పటికే ప్రీ- ప్రొడక్షన్ పనులని కూడా మొదలెట్టేశారు, ఆ సినిమా కోసమే బాలకృష్ణ, కృష్ణ వంశీ, అమితాబ్ కి కలిసినట్టుగా తెలిసింది.రైతు సినిమాలో ఒక కీలక పాత్ర చేయాలనీ అమితాబ్ ని బాలకృష్ణ కోరగా దానికి అమితాబ్ అంగీకరించారు, రైతు సినిమాలో అమితాబ్ ‘భారత రాష్ట్రపతి’గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్రకు ఉన్న ప్రాధాన్యం కారణంగా.. ఇండియాలో మరే నటుడూ ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ కారనే ఉద్దేశ్యంతోనే బిగ్ బీ ని అడిగారట. రైతు సినిమా కోసం అమితాబ్ అప్పుడే డేట్స్ ని కూడా కేటాయించాడు కూడా, అమితాబ్ ఎంట్రీ కారణంగా.. ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే రైతు సంచలనం అయిపోయింది. ప్రస్తుతం శాతకర్ణికి సంబంధించిన పనులను పూర్తి చేస్తున్న బాలయ్య.. జనవరిలో ఆ సినిమాలో రిలీజ్ అయ్యాక.. మార్చ్ చివరి నుంచి రైతు షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

Comments

comments