EDITION English తెలుగు
కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?      "పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!
Home / Reviews / ఆనందో బ్రహ్మ సినిమా రివ్యూ & రేటింగ్.

ఆనందో బ్రహ్మ సినిమా రివ్యూ & రేటింగ్.

ఆనందో బ్రహ్మ సినిమా రివ్యూ & రేటింగ్.

Alajadi Rating

3/5

Cast: తాప్సి, శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, తాగుబోతు ర‌మేష్, ర‌ఘు కారుమంచి తదిత‌రులు.

Directed by: మహి వి.రాఘ‌వ్‌

Produced by: విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి

Banner: 70 ఎమ్‌.ఎమ్‌.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

Music Composed by: కె

దెయ్యాల కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని చాలా హర్రర్ కామెడీ చిత్రాలు వచ్చాయి, అన్ని సినిమాలలో దెయ్యాలని చూసి మనుషులు భయపడుతారు కానీ తొలిసారి అందుకు భిన్నంగా మనుషుల్ని చూసి దెయ్యం భయపడే కాన్సెప్ట్ తో వచ్చిన ఆనందో బ్రహ్మ ట్రైలర్ ప్రేక్షకులలని విపరీతంగా ఆకర్షించింది, ఈ సినిమాలో తాప్సి ప్రధాన పాత్రలో నటించింది, ట్రైలర్ తోనే బాగా హైప్ క్రియేట్ చేసిన ఆనందో బ్రహ్మ సినిమా ఈరోజే విడుదల అయింది.. మరి మనుషులని చూసి దెయ్యం భయపడే కొత్తరకం కాన్సెప్ట్ జనాలకి నచ్చిందా..? లేదా..? మీరు తెలుసుకోండి.

కథ:

బార్ లో పనిచేసే సిద్దు (శ్రీనివాస్ రెడ్డి , ఎటిఎం సెక్యూరిటీ గా పనిచేసే ఫ్లూట్ రాజు (వెన్నెల కిషోర్), ఏ పని లేకుండా ఉండే తులసి (తాగుబోతు రమేష్), సినిమా పిచ్చితో అవకాశాల కోసం తిరుగుతూ ఉండే బాబు (షకలక శంకర్) లు వివిధ సందర్భాలలో స్నేహితులుగా మారుతారు, వీరందరిలో ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది, ఆ సమస్యల పరిష్కారం కోసం వీరిని డబ్బు అత్యవసరంగా మారుతుంది, ఈ సమయంలో శ్రీల‌క్ష్మీనిల‌యం అనే భవనం దెయ్యాలు ఉన్నాయనే కారణంతో అమ్ముడుపోకుండా ఉంటుందని దాని ఓనర్ ద్వారా తెలుసుకొని ఆ శ్రీల‌క్ష్మీనిల‌యం భవనం తాము కొన్ని రోజులు ఉండి అందులో దెయ్యాలు లేవని నిరూపిస్తామని, ఆ తరువాత భవనం అమ్మగా వచ్చే లాభంలో తమకు కొంత ఇవ్వాలని ఆ ఓనర్ తో మాట్లాడుకుంటారు, ఆ ఓనర్ ఒప్పుకోవడంతో ఫుట్ రాజు, తులసి, బాబులతో ఆ ఇంట్లోకి వెళ‌తాడు, ఆ తరువాత ఏం జరిగింది..? ఆ భవనంలో దెయ్యాలు ఉన్నాయా..? వారి సమస్యలు తీరాయా..? అన్నది తెరమీదనే చూడాలి.

అలజడి విశ్లేషణ:

ఒక ఇంట్లో దెయ్యం ఉండటం, ఆ ఇంట్లోకి నలుగురు వెళ్లడం, ఆ దెయ్యానికి భయపడుతూ ఏదో ఒకటి చేసి ఆ దెయ్యం కోరిక తీర్చడం.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి, కానీ తెలుగులో ఫస్ట్ టైమ్ మనుషులని చూసి దెయ్యం భయపడటం అనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా మాత్రం ఆనందో బ్రహ్మ మాత్రమే. కాన్సెప్ట్ కొత్తది అయినప్పటికీ ప్రేక్షకులకి అర్ధం అయ్యేలా చెప్పడంలో డైరెక్టర్ ఫుల్ సక్సెస్ అయ్యాడు.

ఫస్ట్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలతో ఇది మాములు హార్రర్ కామెడీ సినిమానే అని అనిపించినా ఇంటర్వెల్ తరువాత అసలు కథలోకి సినిమా ప్రవేశిస్తుంది, మనుషులని చూసి దెయ్యాలు భయపడటం సన్నివేశాలు బాగా అలరిస్తాయి, ఇంట్లోకి వెళ్లిన న‌లుగురికి నాలుగు ర‌కాల స‌మ‌స్య‌లు ఉండ‌టం, ఆ స‌మ‌స్య‌ల గురించి దెయ్యాల‌కి తెలియ‌క‌పోవ‌డం, దాంతో మ‌నుషులేంటి ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అవి భ‌య‌ప‌డ‌టంతో ఆయా స‌న్నివేశాలు ర‌క్తిక‌డ‌తాయి. అసలు ఆ ఇంట్లోకి దెయ్యాలు ఎలా వచ్చాయి..? ఎందుకు వచ్చాయి..? అనే సన్నివేశాలు కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.

చివరగా…మనుషులని చూసి దెయ్యాలు భయపడటం అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులని ఎక్కడ కన్ఫ్యుజ్ చేయకుండా  ప్రేక్షకులని నవ్వించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

నటీనటుల పెర్ఫార్మన్స్:

సినిమా మొద‌ట్నుంచీ తాప్సినే సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తూ వ‌చ్చింది. అయితే తాప్సితో పోలిస్తే శ్రీనివాస్‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్‌, వెన్నెల‌కిషోర్‌, తాగు బోతు ర‌మేష్ పాత్ర‌ల‌కే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ క‌నిపిస్తుంది. తాప్సి పాత్ర భ‌య‌పెట్టింది త‌క్కువే, అలాగే న‌వ్వించిందీ తక్కువే కానీ మంచి క‌థ‌లో మంచి పాత్రలో తన నటనతో మెప్పించింది. శ్రీనివాస‌రెడ్డి, వెన్నెల‌కిషోర్, ష‌క‌ల‌క శంక‌ర్‌, తాగుబోతు ర‌మేష్ పాత్ర‌లు చేసిన సంద‌డే సినిమాకి ప్ర‌ధాన బ‌లం. ష‌క‌ల‌క శంక‌ర్ చేసిన స్పూఫ్‌లు బాగా న‌వ్వించాయి. తెర‌పై బోలెడ‌న్ని పాత్ర‌లు క‌నిపిస్తాయి. అయితే ఆ స్థాయిలో మాత్రం న‌వ్వులు పండ‌లేదు. ఆయా న‌టులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

ప్లస్ పాయింట్స్ :

  • స్టోరీ
  • స్క్రీన్ ప్లే
  • కామెడీ

మైనస్ పాయింట్స్ :

  • ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు
  • అక్కడక్కడా లాజిక్ లు మిస్ అవ్వడం.

పంచ్ లైన్ : ఆనందో బ్రహ్మ.. బ్రహ్మాడంగా నవ్విస్తుంది..!

Comments

comments