Home / Reviews / అజ్ఞాతవాసి పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

అజ్ఞాతవాసి పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

అజ్ఞాతవాసి రివ్యూ రేటింగ్

Alajadi Rating

2.5/5.0

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను, ఖుష్భు, బోమన్ ఇరానీ, రావు రమేష్ , ఆది పినిశెట్టి, మురళి శర్మ, తనికెళ్ళ భరణి, వెన్నెల కిశోర్ తదితరులు.

Directed by: త్రివిక్రమ్ శ్రీనివాస్

Produced by: చినబాబు

Banner: హారిక & హాసిని క్రియేషన్స్

Music Composed by: అనిరుధ్ రవిచందర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ లు హీరోయిన్ లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈరోజు విడుదల అవ్వనున్న అజ్ఞాతవాసి సినిమాపై ఇప్పటికే అంచనాలు మించిపోయాయి, అడ్వాన్స్ బుకింగ్ లతోనే రికార్డు సృష్టించిన అజ్ఞాతవాసి సినిమా ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి.

కథ:

 వేలకోట్ల విలువ చేసే ఏబీ గ్రూప్‌ కంపెనీ అధినేత గోవింద భార్గవ్‌ అలియాస్‌ విందాని(బొమన్‌ఇరానీ), అతని కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. కంపెనీ వ్యవహారాలు చూసుకునేందుకు విందా భార్య ఇంద్రాణి(ఖుష్బూ) ఓక యువకుడిని (పవన్‌కల్యాణ్‌) అసోం నుంచి పిలిపిస్తుంది. అతను బాలసుబ్రహ్మణ్యం పేరుతో ఏబీ గ్రూప్‌లో పర్సనల్‌ అసిస్టెంట్ గా చేరతాడు. కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ విందా హత్యలకు కారకులైన వారిని కనిపెట్టడం కోసం అన్వేషిస్తుంటాడు. మరి ఆ హత్యలు చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఇందులో సీతారామ్‌(ఆది పినిశెట్టి) పాత్ర ఏంటి? అసలు బాలసుబ్రమణ్యంకి ఆ కంపెనీకి సంబంధం ఏంటి..? ‘అజ్ఞాతవాసి’గా అతను ఎందుకు వచ్చాడు? చివరికి ఏం జరిగింది.. అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటేనే పవర్ ఫుల్ కాంబినేషన్, ఆ అంచనాలకి తగ్గట్లుగానే కార్పొరేట్ కంపెనీలు, ఆధిపత్య పోరు, ఎత్తులకు పై ఎత్తులతో కథనాన్ని త్రివిక్రమ్ నడిపించాడు, కొన్ని కొన్ని సన్నివేశాలలో మహాభారతంలోని అంశాలను ప్రస్తావిస్తూ కథని నడిపిన విధానం ఆకట్టుకుంటుంది, ఫస్ట్ ఆఫ్ లో అజ్ఞాతవాసిగా కంపెనీలో చేరటం, హీరోయిన్ లతో రొమాన్స్, కొన్ని కామెడీ సీన్లతో బాగానే నడిపించాడు, ఇంటర్వెల్ కి ముందు వచ్చే ట్విస్ట్ తో సినిమా అసలు కథలోకి ఎంటర్ అవుతుంది.

సెకండ్ హాఫ్ లో విందాను హత్య చేసి, అతని వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చలనుకున్నది ఎవరు? అనే అంశం చుట్టూ సెకండ్ హాఫ్ ఉంటుంది, స్టోరీ బాగానే ఉన్న కామెడీ కోసం కొన్ని సీన్ లని ఇరికించినట్టుగా అనిపిస్తుంది, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు బాగున్నప్పటికీ అవి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ లో పాటలు వచ్చే టైమింగ్ కి, స్క్రీన్ ప్లే కి సెట్ కాలేదు, సెకండ్ హాఫ్ లో “కొడుకా కోటేశ్వరావు “పాట సూపర్బ్ గా ఉంది, ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే మార్క్ కామెడీ ఈ సినిమాలో పండలేదు, రావు రమేష్, మురళి శర్మ, వెన్నెల కిషోర్ పాత్రలు నవ్విస్తాయి.

త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ పాత్ర చుట్టే కథ నడుపుతూ విలన్ పాత్రలని మరి అంత బలంగా చూపించకపోవడం వల్ల హీరో, విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు అంతగా కిక్కు ఇవ్వవు, క్లైమాక్స్ లో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో సెంటిమెంట్ ని పండించాడు , చివరగా అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగగా ఉండి.. మామూలు సినిమా అభిమానులకు మామూలుగానే అనిపిస్తుంది.

నటీనటుల పెర్ఫార్మన్స్:

 ‘అజ్ఞాతవాసి’లో పవన్ వన్ మ్యాన్ షో చూడొచ్చు. దాదాపుగా ప్రతి సీన్లోనూ పవన్ కళ్యాణ్ ఉంటాడు. అభిమానులు తనను ఎలా చూడాలనుకుంటారో అలా కనిపించాడు. హీరోయిన్లు కీర్తి సురేష్.. అను ఇమ్మాన్యుయెల్ ల పాత్రలు ఇంపార్టెన్స్ లేనివి. ఇంత పెద్ద సినిమాలో హీరోయిన్లను మరీ ఇలా చూపించడం ఎవ్వరికైనా నిరాశ కలిగిస్తుంది. విలన్ పాత్రలో ఆది పినిశెట్టి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది కానీ.. అతడి పాత్రా బలహీనమే. ఖుష్బు అయినా అంతే. బొమన్ ఇరానీ ఓకే. రావు రమేష్.. మురళీ శర్మ కొంత మేర నవ్వించే బాధ్యత తీసుకున్నారు. వెన్నెల కిషోర్ కనిపించిన తక్కువ సన్నివేశాల్లోనే నవ్వించాడు.

ప్లస్ పాయింట్స్ :

  • పవన్ కళ్యాణ్
  • కామెడీ సీన్స్
  • పాటలు

మైనస్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే
  • త్రివిక్రమ్ మార్క్ మిస్సింగ్ ´

పంచ్ లైన్: అజ్ఞాతవాసి చూడాలంటే ఒక మినీ యుద్ధం చేయాల్సిందే.

(Visited 772 times, 40 visits today)