Home / Inspiring Stories / స్వచ్చభారత్ కోసమంటూ మోయలేని భారం మోపుతున్న మోడీ ప్రభుత్వం.

స్వచ్చభారత్ కోసమంటూ మోయలేని భారం మోపుతున్న మోడీ ప్రభుత్వం.

Author:

ఇప్పటి వరకూ మీరుకొనే ప్రతీ వస్తువు మీదా,పొందే సేవల మీదా ట్యాక్స్ చెల్లిస్తూనే ఉన్నారు కదా… ట్యాక్స్ లకి ఇప్పుడు మరో రెండు కొత్త రకం ట్యాక్స్ లు వచ్చి చేరాయి వాటిలో స్వచ్చ భారత్ పన్ను ఒకటైతే మరికటి కళ్యాణ్ కృషి కళ్యాణ్‌ సెస్‌… ఈ పాటికే మీ మొబైల్ కి మెస్సెజ్ వచ్చి ఉంటుంది రోజూ వచ్చే సర్వీస్ ప్రొవైడర్ మెస్సెజ్ అనుకొని మీరు చూసి ఉండరు గానీ… ఈ పాటికే మీ జేబుకి చిల్లు పెట్టే ప్రయత్నం మొదలైపోయింది…

కృషి కళ్యాణ్ సెస్ అమలులోకి వస్తుందనగానే ఇన్సూరెన్స్ కంపెనీలు, మొబైల్ కంపెనీలు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ అందరూ వినియోగదారులకు మెస్సేజ్ లు పంపారు. ఒకటి నుండి 0.5 సెస్ ఉంటుంది. అదనంగా కట్టాలి గుర్తుకు పెట్టుకోండని హెచ్చరించాయి. స్వచ్చ భారత్ పెట్టి దాని మీద చంద్రబాబు ఇచ్చిన నివేదిక పుణ్యమా అని 0.5 వేశారు. ఇప్పుడొకటి. యూపీఏ వెళ్లిపోయేటప్పుడు ట్యాక్స్ లు 11.5 ఉంటే ఎన్డీఏ వచ్చి రెండేళ్లు పూర్తి కాకముందే దానిని 15శాతం చేసింది.

సెల్ ఫోన్‌కు బ్యాలెన్స్ వేయించుకున్నా హోటల్‌కు వెళ్లినా మరే ఇతర పని చేసినా ప్రతి సందర్భంలోనూ ప్రతి ఒక్కరూ సెస్‌ కట్టాలి.. మోడీ ప్రవేశపెట్టిన ఈ సెస్‌ షాక్ ఈ జూన్ ఒకటి నుంచే మొదలైపోయింది. జూన్ ఒకటి నుంచి కృషి కళ్యాణ్‌ సెస్‌ వసూలు చేస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న బడ్జెట్‌లో చెప్పింది,అన్నట్లుగానే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఫోను బిల్లులు, ఇంటర్నెట్‌ వాడకం, ప్రయాణాలు, హోటల్ భోజనాలు ఇలా ప్రతి సందర్భంలోనూ సేవా పన్ను రూపంలో అదనంగా ప్రతి ఒక్కరూ డబ్బు చెల్లించాల్సుంటుంది. 0.50 శాతం మేర ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం సెస్‌ వసూలు చేస్తుంది. ఇక పది లక్షలు, అంతకుమించి విలువచేసే కార్ల కొనుగోలు చేసేట్లయితే మరో ఒక శాతం అదనపు సెస్‌ చెల్లించాల్సుంటుంది.గత ప్రభుత్వానికన్నా గొప్పగా మోడీ సర్కార్‌ రకరకాల సెస్‌లు తెరపైకి తెస్తోంది. ఆయా సెస్‌ల పేరుతో ప్రతి ఒక్కరి దగ్గరి నుంచీ వాళ్ల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అదనపు వసూళ్లకు పాల్పడున్నారు.

Service Tax Krushi Kalyan Cess

ప్రస్తుత సెస్‌తో హోటళ్లలో భోజనం, ప్రయాణ చార్జీల్లాంటివేగాక బీమా, ఆస్తుల కొనుగోలు తదితర అంశాల్లోనూ అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. గతేడాది 12.36 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్‌ మోడీ పాలనలో 14 శాతానికి ఆ తర్వాత స్వచ్ఛ భారత్ సెస్‌తో 14.5 శాతానికి తాజా సెస్‌తో 15 శాతానికి చేరింది. మంచి రోజులు వస్తున్నాయి అంటే ఇలా అడ్డదిడ్డంగా తమ ఇష్టాయిష్టాలతో సంబంధంలేకుండా డబ్బు వసూలు చేయడమేనేమో.? అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

సర్వీస్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వచ్చే అన్ని రకాల సేవలపైనా స్వచ్ఛ భారత్‌ సేవా పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ దీపావళి తర్వాత నుంచి దేశ ప్రజలకు సైలెంట్‌గా పన్నుల మోత మోగించనున్నారు. ఇప్పటికే సేవా పన్ను 14 శాతానికి ఎగబాకిన నేపథ్యంలో మరో అదనపు భారంగా స్వచ్ఛ సెస్‌ పేరిట కొత్త పన్నులను వసూలు చేసేందుకు కేంద్రం సిద్ధమైపోతోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి స్వచ్ఛభారత్ సుంకం విధింపు ద్వారా కేంద్రానికి రూ.400 కోట్ల ఆదాయం సమకూరనుందని అంచనా. అన్ని రకాల సేవలపై 2 శాతం వరకు స్వచ్ఛ భారత్ సుంకం విధించాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. తాజాగా సుంకాన్ని 0.5 శాతంగా నిర్ణయించారు. అంటే ప్రతి రూ.100 విలువైన సేవలపై మరో 50 పైసలు సెస్సు రూపంలో వసూలు చేయనున్నారు.

Krushi Kalyan Cess

అయితే ఇది అదనపు పన్ను కాదని, దేశంలోని ప్రతిఒక్కరూ ఈ పథకానికిచ్చే తోడ్పాటని, ఈ సుంకం విధింపు ద్వారా సమకూరిన మొత్తాన్ని స్వచ్ఛభారత్ కార్యక్రమాలకే ఉపయోగించనున్నట్లు తన స్టేట్‌మెంట్‌లో ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాల్లో స్వచ్ఛ భారత్ ఒకటి. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఇటీవలే ఏడాది పూర్తయ్యింది. దీనిపై తాజాగా కేంద్రప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. కాగా ఇప్పటికే స్వచ్ఛ భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం తెగ పబ్లిసిటీ చేసింది. కేవలం ప్రచారం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేసి నిధులను దుర్వినియోగం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అచ్చేదిన్ అంటూ అందరికీ మాయ మాటలు చెప్పిన మోడీ సామాన్యులను చావుదెబ్బ తీస్తున్నాడు. అరుణ్ జైట్లీ తెలివో లేకుంటే మరేంటో కానీ పేద, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి జనాలను చావు దెబ్బ కొడుతున్నాడు. మనం తెచ్చుకునే ప్రతి సరుకుపైనా ట్యాక్స్ లు ఉంటాయి. వాటిని మొత్తంగా బయటకు వెళ్లి తినాలంటే దాని మీద మరో రెండు రకాల పన్నులు. లేని పథకాలన్నీ పెట్టి జనాల మీద భారం వేసి చావుదెబ్బ తీస్తున్నాడు. వేర్వేరుగా చూస్తే వాటి ప్రభావం చాలా తక్కువగా కనిపించొచ్చు. కానీ ఇంట్లో మనం తెచ్చుకునే సరుకుల నుండి చివరకు పెట్రోల్ వరకు అన్నీ చూసుకుంటే నెలకు ఒక వ్యక్తికి అదనంగా వంద రూపాయల పైన పడుతుంది ఇదంతా ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ పుణ్యమేననే విమర్శలు వస్తున్నాయి.

(Visited 820 times, 20 visits today)