Home / Entertainment / అనుష్క సైజ్ జీరో రెడీ.

అనుష్క సైజ్ జీరో రెడీ.

Author:

దేవసేన అనుష్క చెస్తున్న డిఫరెంట్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సైజ్‌జీరో’తో ఫస్ట్ లుక్ రిలీజైంది.తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో  విడుదల చేసిన ఈ చిత్రం లోగోను అనుష్క ఆన్లైన్ లో షేర్‌ చేసింది.ఇప్పటికే ఆన్లైన్ లో ఈ లోగోని ఫన్స్ తెగ లైక్స్ చేస్తున్నారు. పివిపి సంస్థ నిర్మాణంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్‌ కోవెలమూడి ఇ సినిమాకి దర్శకత్వం చెస్తున్నాడు.ఈ చిత్రం కోసం అనుష్క 20 కిలోలు పెరిగి,మళ్ళీ నార్మల్‌ వెయిట్‌కు వచ్చింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో అనుష్క, ఆర్య, భరత్‌, ఊర్వశి మొదలైన వారు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాహుబలి, రుద్రమదేవి తరువాత అనుష్క చేస్తున్న ఈ ఎక్స్పరిమెంటల్ మూవీ ఎలా ఉందబోతోందో ఈ లోగో చెప్పకనె చెబుతోంది.. సన్న జాజి నడుము అని లోగొ కిందట్యాగ్ ఉంది..మరి నడుము అందాలని జూం వెసి మరీ చూపించే రాఘవేంద్ర రావ్  గారి అబ్బాయి ఎలా చూపిస్తాడో చూడాలి..

(Visited 66 times, 8 visits today)