Home / Entertainment / ఒకే రోజు మూడు మెగా సినిమాలు ప్రారంభం.

ఒకే రోజు మూడు మెగా సినిమాలు ప్రారంభం.

Author:

Mega Movies

ఎన్నో రోజుల నుండి ఎప్పుడు చిరంజీవి 150వ చిత్రం ప్రారంభం అవుతుందా..! అని వెయిట్ చేస్తున్న మెగా అభిమానులకు ఇప్పుడు ఒక శుభ వార్త. చిరంజీవి 150వ చిత్రం ఈనెల 29న మధ్యాహ్నం 1.30 కు అధికారికంగా ప్రారంభం జరుపుకోనున్నట్లు తెలిసింది. ఈ చిత్రనికి వివి వినాయక్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఎన్నో రోజులు చాలా కథలు విన్న చిరంజీవి చివరకు తమిళ సినిమా అయిన కత్తి ని రీమెక్ చేయాలని ఫిక్స్ అయి దానిని తెలుగు ప్రేక్షకులను ఏవిధంగా అయితే నచ్చుతుందో అలాంటివి అన్ని మార్పులు చేసి మనకు అందించబోతున్నారు. ఈ చిత్రానికి చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. అలాగే కత్తి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

మీకు మరో సంతోషకరమైన వార్త ఈ మధ్యనే సర్దార్ గబ్బర్ సింగ్ గా మన ముందుకు వచ్చిన పవర్ స్టార్ తన తదుపరి సినిమా యస్.జే సూర్యతో ఉంటుందని తెలిపిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా కూడా ఈ నెల 29న ప్రారంభం అవుతున్నట్లు తెలిసింది.అలాగే వరుణ్ తేజ్ చివరి చిత్రం లోఫర్ సినిమా తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పేరు మిస్టర్ అని తెలియాజేయడం కూడా జరిగింది. ఈ సినిమా కూడా ఈనెల 29న ప్రారంభం అవుతున్నట్లు తెలిసింది. ఒకే రోజు మెగా స్టార్ ఇంట్లో మూడు సినిమాలు ప్రారంభం అవుతుండంతో మెగా అభిమానులు చాలా సంతోషంలో ఉన్నట్లు తెలుస్తుంది.

(Visited 1,002 times, 14 visits today)