Home / Inspiring Stories / 25 ఫీట్ల మంచు గడ్డల కింద 6 రోజులుగా మృత్యువు తో పోరాడిన భారత సైనికుడు.

25 ఫీట్ల మంచు గడ్డల కింద 6 రోజులుగా మృత్యువు తో పోరాడిన భారత సైనికుడు.

Author:

సియాచిన్ భారత సైన్యం నిబద్దతకూ వారి పోరాట పటిమకూ… భారత దేశ గుండె ధైర్యనికీ ఒక మచ్చుతునక, ప్రపంచంలో ఎత్తైన సైనిక స్థావరం సియాచిన్ గ్లేసియర్. 30 సంవత్సరాలలో చలి గాలి, హిమపాతం, హిమ లోయలలోకి పడిపోయి విపరీతమైన చలికి అనారోగ్యం సమస్యతో మృతిచెందిన భారతీయ సైనికుల సంఖ్య ఇప్పటివరకూ 869.సియాచిన్ సముద్ర మట్టం నుండి 20 వేలు అడుగులు ఎత్తున ఉన్నది. 2015-16 సంవత్సరంలో సియాచిన్ సైనిక స్థావరానికి భారత ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.938 కోట్లు.70 కిలోమీటర్లు పొడవైన మంచు పరుపు వున్నది. అక్కడ ఉండే కనిష్ట ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? 60 డిగ్రీలు. అంతే కాదు నిత్యం 160 కిలోమీటర్ల వేగంతో వీచే మంచుగాలులు ఉంటాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని కారకోరం పర్వత శ్రేణులలో ఉన్నది. ఇక్కడ నిరంతర కాపలాలో ఉండే భారత సైనికులు శతృవులతోనే కాదు అక్కడ ఉండే ప్రకృతి తోనూ నిరంతరం పోరాడాల్సి వస్తుంది.

Siachen Miracle Jawan Under Snow

వారం రోజుల క్రితం మంచు చరియలు విరిగిపడిన ఘటనలో సుమారు పది మంది జవాన్లు చిక్కుకున్నారు. సియాచిన్ ప్రాంతంలో తాము రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుండగా ఈ ఘటన జరిగింది. సియాచిన్‌లో మంచుతుపాను కారణంగా భారీ మంచు దిబ్బల్లో కూరుకుపోయిన 10 మంది సైనికులు మృతి చెందారని అధికారులు దృవీకరించారు. దేశం మొత్తం ఈ సంఘటన కు చలించి పోయింది. ఆ వీర సైనికులకు నివాళులర్పించింది. అయితే ఈ విషాదంలోనూ ఒక అద్బుతం చోటు చేసుకుంది. చనిపోయిన జవాన్ల మృతదేహాల కోసం గాలిస్తూండగా లాన్స్ నాయక్ గ్రేడ్ లో ఉన్న హనుమంతప్ప అనే ఒక సైనికుడు సజీవంగా బయట పడ్డాడు. అంతటి చలిలోనూ ఆయన ఆరు రోజుల నుంచీ మృత్యువుతో పోరాడుతూనే ఉన్నాడు. వెంటనే ఆయనను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. చికిత్స జరుగుతోంది. సుమారు 25 ఫీట్ల మంచు కింద హనమంతప్ప రెస్క్యూ సిబ్బందికి సజీవంగా కనిపించాడు. దాదాపు మైనస్ 40 డిగ్రీ సెల్సియస్ వాతావరణంలో అతను ప్రాణాలతో ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రస్తుతం హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ఆయనను వెంటనే ఆర్మీకి చెందిన ఆర్‌ఆర్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న హనమంతప్ప కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కర్ణాటకకు చెందిన లాన్స్ నాయక్ హనమంతప్ప కొండ చరియలు విరిగిపడిన సమయంలో అక్కడే విధుల్లో ఉన్నాడు. లాన్స్ నాయక్ హనమంతప్ప కర్ణాటకలోని ధార్వాడ జిల్లాకు చెందిన వాడు. నాలుగైదు రోజులుగా కుటుంబ సభ్యుల ఆందోళనతో ఉన్నారు. ప్రాణాల నుంచి బయటపడ్డాడని తెలియడంతో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. తన కుమారుడు దేశ రక్షణ కోసమే సైన్యంలో చేరాడని హనమంతప్ప తల్లిదండ్రులు తెలిపారు. ఫిబ్రవరి 3న సియాచిన్ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడటంతో వాటి కింద పది మంది భారత సైనికులు చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారిని గుర్తించేందుకు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ముమ్మరంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఘటనకు సంబంధించి మొత్తం ఐదు మృతదేహాలను వెలికితీశారు. ఇందులో నలుగురిని గుర్తించారు. హనుమంతప్ప కోలుకోవాలనీ ఆ వీర సైనికుడు మళ్ళీ సజీవంగా తిరిగి రావాలనీ కోరుకుంటోంది అలజడి.కాం

Must Read: ట్రయల్ రూం లో సీసీ కెమెరా ఉంటే ఎలా తెలుసుకోవాలి?

(Visited 4,649 times, 67 visits today)