EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

భూమి కి పొంచి ఉన్న భారీ ప్రమాదం ??

Author:

ఎప్పటికీ మనకు ఈ విశ్వం అంతుచిక్కని రహస్యమే.. ఏ రోజుకా రోజు..ఏదో ఒక కొత్త వార్తో, ఇంకొత్త సంఘటనో, నమ్మశక్యం కాని నిజాలో వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఖగోళ పరిశోధకులు అహర్నిషలు రీసర్చ్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ అనంత విశ్వం మాత్రం ఎప్పటికీ అర్థం కాని బ్రహ్మ పదార్థంగానే మిగిలిపోవడం విడ్డూరం. ఇప్పటికే అంతరిక్షం గురించీ, అంతరిక్షంలో సంభవించే అనేక వింతలూ విశేషాలు చూశాం.

Earth having trouble with asteroids

అయితే ఎప్పటినుంచో వింటున్న కొన్ని వార్తలు మానవాళిని, భూ గ్రహాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అంతరిక్షం నుంచి రాలి పడే కొన్ని ఉల్కలు భూమిని చాలా వేగంగా తాకుతాయని.. భూమికి చాలా నష్టం కలిగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి త్వరలో భూమికి ఇలాంటి ఉల్కల ద్వారా చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు ఐర్లాండ్ కు చెందినా ఖగోళ శాస్త్రవేత్తలు. తొందర్లోనే భూమిని ఓ భారీ ఉల్క ఢీకొనడం ఖాయమని, దీని కోసం ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉండాలని ప్రఖ్యాత ఆస్ట్రోఫిజిసిస్ట్ ఫిట్జ్ సిమ్మన్స్ హెచ్చరిస్తున్నాడు.

ఒక శతాబ్దం కింద అంటే, 1908 జూన్ 30న సైబీరియాలోని తుంగుస్కా అనే ప్రాంతాన్నిఒక చిన్న ఉల్క ఢీకొట్టడంతో దాదాపు 800 చదరపు మైళ్ల భూభాగం సర్వనాశనమైందని తెలిపారు. ఒక చిన్న ఉల్క ఢీ కొంటేనే ఎంతో ప్రమాదం జరిగింది, భారీ నష్టం వాటిల్లిందని, మరి ఓ పెద్ద ఉల్క ఢీకొంటే జరిగే నష్టం ఎలా ఉండనుందో ఊహించండి అని హెచ్చరిస్తున్నారు సిమ్మన్స్. ఏది ఏమయినా ఒకవేళ భారీ ఉల్క ఢీ కొంటే మాత్రం వాటిల్లే నష్టం అపారంగానే ఉంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పటికే మన దేశ, విదేశాల్లోని శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు భూమికి సమీపంలో ఉన్నవి, హాని కలిగించే అవకాశమున్నవీ దాదాపు 1800 ఆస్టరాయిడ్లని గుర్తించారని అయన చెప్పారు. అయితే, ఇంకా చాలా వాటిని గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన తెలిపారు. జూన్ 30 న ప్రపంచ ఆస్ట్రాయిడ్ డే సందర్భంగా లక్సెంబర్గ్ వేదికగా ఖగోళ శాస్త్రవేత్తలు, నిపుణులతో జరిగే చర్చలో సిమ్మన్స్ కూడా పాల్గొననున్నారు. త్వరలోనే భూమికి మరో తుంగుస్కా లాంటి ప్రమాదం ఉల్కాపాతం ద్వారా ఏ క్షణంలోనైనా సంభవించే అవకాశం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇదే విషయమై ఆయన జరగబోయే సదస్సులో కూడా విపులంగా చర్చించనున్నారు. ఉల్కలు, వాటి గురించిన వీడియో చూడాలంటే ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

(Visited 154 times, 51 visits today)

Comments

comments