EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

Video: లైవ్ లో వేణు స్వామి బండారం బయటపెట్టిన బాబు గోగినేని…!

Author:

జ్యోతిష్కం పేరుతో పెద్ద పెద్ద రాజకీయ నాయకులని, సినిమావాళ్లని, వైరల్ విషయాలని టార్గెట్ చేస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్న వేణు స్వామి బండారాన్ని మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాడే సామాజిక కార్యకర్త బాబు గోగినేని బయటపెట్టారు, ఫేస్ బుక్ లో వీడియో రూపంలో ప్రముఖుల జాతకాలు చెప్తూ పాపులర్ అయిన వేణు స్వామికి ఒక న్యూస్ ఛానల్ లో లైవ్ గా బాబు గోగినేని చుక్కలు చూపించారు, కొన్ని రోజుల కిందట ప్రాణ చికిత్స పేరుతో ఫోన్ కాల్ తో రోగం నయం చేస్తాం అన్న వాళ్ళని కూడా లైవ్ లోనే చుక్కలు చూపించిన బాబు గోగినేని ఇప్పుడు జ్యోతిష్కం పేరుతో ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్న వేణు స్వామి బండారం బట్టబయలు చేసాడు.

ఫేస్ బుక్ లో సెలెబ్రెటీల జాతకాలు, వైరల్ ఇష్యూలపై జ్యోతిష్కం పేరుతో పోస్టులు పెడుతూ సినీ, రాజకీయ జ్యోతిష్కుడిగా పేరుగాంచిన వేణు స్వామి ఇప్పటివరకు అనేక మంది సెలెబ్రెటీల జాతకాలని సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్టు చేసాడు, వేణు స్వామి జ్యోతిష్కం పేరుతో సెలబ్రెటీల జాతకాలూ చెప్తూ సాధారణ ప్రజలని ఆకట్టుకుంటూ మూఢనమ్మకాలని ప్రజలలో పెంపొందిస్తున్నాడని బాబు గోగినేని ఆరోపణలు చేసారు, ఈ సందర్భంగా ఈ సందర్భంగా ప్రధానమంత్రిని కూడా తన ప్రచారానికి వేణు స్వామి వాడుకుంటున్నారని ఆరోపించారు.మోడితో దిగిన మార్ఫింగ్ ఫొటో పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కళ్యాణ్ గుత్తికొండ అనే వ్యక్తి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం సేకరించగా…ప్రధాని మోడీతో వేణుస్వామి ఎలాంటి ఫొటో దిగలేదని బయటపడింది.

నూటికి తొంబై కరెక్ట్ చెప్తా అనే వేణు స్వామి పాత వీడియో పోస్టింగ్ లన్ని తీసుకొచ్చి నూటికి ఒక్కటే కరెక్ట్ అవుతుందని మిగతా 99 అబద్దాలే చెప్తాడు అని బాబు గోగినేని లైవ్ గా నిరూపించారు, ఈ దెబ్బకి బాబు గోగినేని హిందూ మతాన్ని కించపరుస్తున్నారని “నేను చెప్పేవి తప్పులు. నన్ను నమ్మకండి. బాబు గోగినేది వ్యక్తిగతంగా ఎదురుదాడి చేస్తున్నారు.నాకు జ్యోతిష్యం రాదు. ఆయన చెప్పిందే నమ్మండి.నేను చెప్పేది నిజాలు కాదు” అని అంటూ చర్చ మధ్యలోనే వెళ్లిపోయారు వేణు స్వామి.

జ్యోతిష్కన్ని వ్యతిరేకించడం హిందూ మతానికి వ్యతిరేకం కాదని, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, స్వామి అగ్నివేశ్ లాంటి వారు జ్యోతిష్కన్ని వ్యతిరేకించారని కానీ వాళ్లంతా హిందూ మతం వాళ్లే అని, తానూ చేసే జ్యోతిష్కం పేరుతో చేస్తున్న మోసానికి వ్యతిరేకం అని, తనది హిందూ కుటుంబమే అని ఈ సందర్భంగా బాబు గోగినేని స్పష్టం చేసారు.

(Visited 762 times, 778 visits today)

Comments

comments