Home / Latest Alajadi / V6 బిత్తిరి సత్తి పై దాడి..!

V6 బిత్తిరి సత్తి పై దాడి..!

Author:

తనదైన భాషతో యాసతో ప్రేక్షకుల్ని ఆకట్టున్న బిత్తిరి సత్తిపై V6 న్యూస్ చానెల్ ఆఫీస్ దగ్గర దాడి జరిగింది. మధ్యాహ్నం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని వీ6 ఆఫీస్ కు వచ్చిన సత్తి కారులోంచి దిగగానే మణికంఠ అనే వ్యక్తి దాడిచేశాడు. దీంతో బిత్తిరి సత్తి ముఖం మీద, చెవి కింద దెబ్బలు తగిలాయి. హఠాత్తుగా జరిగిన ఈ దాడి చూసి అక్కడున్నవాళ్లు, వీ6 సిబ్బంది స్పందించి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. సత్తిని స్టార్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు దెబ్బలకు చికిత్స చేశాక డిశ్చార్జి చేశారు.

v6-bithiri-satti

ఈ సంఘటనపై బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. అతను ఉదయం నుండి వీ6 ఆఫీస్ ముందే దాడికోసం ఎదురుచూసినట్లు తెలుస్తోంది. వీ6 తెలంగాణకు వ్యతిరేకమంటూ మణికంఠ ఉన్మాదంగా మాట్లాడుతున్నట్లు సంఘటన జరిగిన సమయంలో అక్కడున్నవాళ్లు చెబుతున్నారు. తెలంగాణ భాష, యాసని ఉపయోగిస్తూ V6 ఛానెల్ అతి తక్కువ సమయంలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది, ఇంకా బిత్తిరి సత్తి ప్రోగ్రామ్ అంటే అనేక మందికి ఇష్టం అలాంటిది V6 తెలంగాణకి వ్యతిరేకం అని చెబుతూ మణికంఠ దాడి చేయడాన్ని బట్టి.. అతను ఉన్మాది అయుంటాడా..లేదా ఎవరైనా రెచ్చగొట్టి దాడి చేయించారా అన్న అనుమానాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Comments

comments