Home / Entertainment / రేపు ఉదయం 9 గంటలకు థియేటర్ల లో విడుదల కానున్న బాహుబలి 2 ట్రైలర్.

రేపు ఉదయం 9 గంటలకు థియేటర్ల లో విడుదల కానున్న బాహుబలి 2 ట్రైలర్.

Author:

దేశవ్యాప్తంగా అన్ని భాషల సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బాహుబలి2 ట్రైలర్ రేపే అభిమానుల ముందుకు వచ్చేస్తోంది. ఇంతకుముందేన్నడు లేని విధంగా మొదటిసారిగా సినిమా థియేటర్లలో ప్రేక్షకుల కొరకు ప్రత్యేకంగా బాహుబలి 2 ట్రైలర్ ను ఉచితంగా ప్రదర్శించనున్నారు. రేపు ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య సెలెక్ట్ చేసిన కొన్ని సినిమా థియేటర్లలో బాహుబలి 2 ట్రైలర్ ను ఉచితంగా ప్రదర్శించనున్నారు, దీనికి ప్రేక్షకులు ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన పనిలేదు కాకపొతే ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో ముందు వచ్చిన వారిని సీట్లు నిండేదాక థియేటర్లలోకి అనుమతిస్తారు. ఇంకెందుకు ఆలస్యం మీ ఏరీయా లో ఏ థియేటర్లో బాహుబలి 2 ట్రైలర్ ను ప్రదర్సిస్తున్నారో బాహుబలి ఫేస్ బుక్ పేజీలో చూసి తెలుసుకోండి లేదంటే ఇక్కడ క్లిక్ చేయండి.

bahubali 2 trailer

2 నిమిషాల 20 సెకన్ల పొడగు ఉన్న బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ కి యూఏ సర్టిఫికేట్ లభించింది. బాహుబలి మొదటి పార్టు ఘన విజయం తరువాత వస్తున్న బాహుబలి ది కంక్లూజన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా థియేటర్లలో బాహుబలి2 ట్రైలర్ చూడలేకపోయిన వారు చింతించాల్సిన అవసరం లేదు, థియేటర్లలో విడుదల అయిన పిమ్మట అదే ట్రైలర్ యూట్యూబ్ లో అందుబాటులోకి వస్తుంది.

MUST READ: రికార్డు ధరకు అమ్ముడైన సూపర్స్టార్రజనీకాంత్  ‘2.0’ సినిమా శాటిలైట్ప్రసార హక్కులు.

(Visited 711 times, 25 visits today)