Home / Reviews / బాహుబలి 2 రివ్యూ & రేటింగ్.

బాహుబలి 2 రివ్యూ & రేటింగ్.

బాహుబలి రివ్యూ

Alajadi Rating

4/5

Cast: ప్రభాస్, రానా, రమ్య కృష్ణ, అనుష్క, తమన్నా, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజు..తదితరులు.

Directed by: రాజమౌళి

Produced by: ప్రసాద్, శోభు

Banner: ఆర్కా మీడియా

Music Composed by: కీరవాణి

బాహుబలి ది బిగినింగ్ సినిమా కొన్ని అంచనాలతోనే వచ్చి తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది, కేవలం ఒకేఒక ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? అనేదాని కోసం దేశమంతా రెండు సంవత్సరాలు ఎదురుచూసేలా చేయడం ఒక్క రాజమౌళికి సాధ్యమైంది, మొదటి భాగాన్ని మించిపోయేలా రెండవ భాగం ఉంటుందని చెప్పడంతో బాహుబలి ది కంక్లూజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి, దేశంలో 90 % థియేటర్ లలో బాహుబలి విడుదల అవుతుంది అంటే క్రేజ్ ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు, ఫుల్ క్రేజ్ , హైప్ ల మధ్య ఈరోజు విడుదల అయిన బాహుబలి ది కంక్లూజన్ సినిమా ఎలా ఉందొ మీరు తెలుసుకోండి.

కథ:

అమరేంద్ర బాహుబలిని (ప్రభాస్) మాహిష్మతి రాజ్యానికి మహారాజుగా శివగామి దేవి ప్రకటిస్తుంది, పట్టాభిషేకంకి ముందు బాహుబలి దేశ పర్యటనకు వెళ్తాడు, మధ్యలో దేవసేన (అనుష్క) రాజ్యం అయిన కుంతల సామ్రాజ్యాన్ని ఆపద నుండి కాపాడుతాడు, దేవసేనని పెళ్లి చేసుకోవడం కోసం మాహిష్మతి రాజ్యానికి తీసుకెళ్తాడు, కొన్ని కారణాల వల్ల శివగామి బాహుబలిని కాకుండా భళ్లాలదేవుడిని రాజుగా ప్రకటిస్తుంది, అలాగే బాహుబలిని రాజ్యం నుండి బయటకి పంపిస్తుంది. ఆతరువాత కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు…శివగామి బాహుబలిని ఎందుకు రాజుని చేయలేదు..? బాహుబలిని రాజ్యం నుండి ఎందుకు బహిష్కరించింది..? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? ఇవన్నీ తెలుసుకొని శివుడు ఏంచేసాడు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

అలజడి విశ్లేషణ:

బాహుబలి ది బిగినింగ్ సినిమాతో హాలీవుడ్ రేంజ్ కి మన తెలుగు సినిమాని రాజమౌళి తీసుకెళ్లాడు, బాహుబలి మొదటి భాగాన్ని ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దిన రాజమౌళి రెండవ భాగాన్ని అంతకుమించి అన్నట్లుగా రూపొందించాడు, రెండవ భాగంలో వచ్చే క్యారెక్టర్ లు అన్ని బలంగా ఉంటాయి, బాహుబలి మొదటి భాగంలో కథేమీ లేకుండా పాత్రల పరిచయం వరకు మాత్రమే చూపించిన రాజమౌళి ఈ భాగంలో పాత్రలని బలంగా తీర్చిదిద్ది ,పాత్రల మధ్య ఎమోషన్ ని అద్భుతంగా తెరకెక్కించాడు.

బాహుబలి ది బిగినింగ్ లో ఉన్నంత వార్ సీక్వెన్స్ ఇందులో లేకపోయినా బలమైన కథ తో సినిమాని నడిపించాడు, బాహుబలి , భల్లాల దేవా ఎంట్రీ సీన్లని అద్భుతంగా చూపించాడు, ముఖ్యంగా ప్రభాస్ లో హీరోయిజం ఎలివేట్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యారు, కొన్ని కొన్ని సన్నివేశాలలో శివగామి పాత్రని మించి దేవసేన పాత్రా ఉండటం ప్రేక్షకులకి ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది, కాకపోతే మొదటి భాగంలో ఉన్నంత పతాకస్థాయిలో యుద్ధ సన్నివేశాలు లేకపోవడం ప్రేక్షకులకి నిరాశని కలిగిస్తుంది, యుద్ధాల కంటే ఎక్కువగా పాత్రల మధ్య కథని , ఎమోషన్స్ ని నడిపించారు, మొదటి భాగం మొత్తం సీరియస్ గా కట్టప్ప పాత్రాతో చేపించిన కామెడీ బాగా వర్క్ అవుట్ అయింది, మొత్తానికి మరొక విజువల్ గ్రాండియర్ ని బాహుబలి ది కంక్లూజన్ రూపంలో మన ముందుకు తీసుకవచ్చి మన తెలుగు సినిమా స్థాయిని మరోమెట్టు ఎక్కించారు.

నటీనటుల పనితీరు:

ప్రభాస్ :  ప్రభాస్ గురుంచి చెప్పేది ఏముంది చాలా అద్భుతంగా చేసాడు, ఎమోషనల్ సీన్లు అయిన, హీరోయిజం సీన్లు అయిన, యుద్ధ సన్నివేశాలు అయిన సరే అన్నింటిలోనూ అదరగొట్టాడు, మెహంలోనే రాజసం ఉట్టిపడేలా నటించాడు.

రానా: భల్లాలదేవ పాత్రలో రానా తన నట విశ్వరూపాన్ని చూపెట్టాడు, ఒకవైపు మంచిగా నటిస్తూ మరోవైపు క్రూరత్వాన్ని ప్రదర్శించడంలో ప్రస్తుతం రానాకీ సాటి ఎవ్వరు లేరు అన్నంతగా నటించాడు.

అనుష్క:  దేవసేన పాత్రకి తననే ఎందుకు తీసుకున్నారో అనుష్క తన యాక్టింగ్ టాలెంట్ తో చూపించింది, యువరాణిగా ప్రేక్షకులని మెప్పిస్తుంది, కొన్ని సన్నివేశాలలో శివగామిని మించేలా నటించింది.

రమ్యకృష్ణ: మొదటి భాగంలోనే రమ్యకృష్ణ అద్భుత నటనని చూసాం, ఈసారి ఇద్దరు కొడుకుల మధ్య నగిలిపోతున్న ఒక తల్లిగా , రాజమాతగా అదరగొట్టింది.

సత్యరాజ్: మొదటి భాగంలో మొత్తం సీరియస్ పాత్రలో ఉన్న సత్యరాజ్ , ఈ భాగంలో కామెడీగా చేసాడు, అలాగే ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించాడు.

ఈ భాగంలో తమన్నాది చిన్న పాత్రా, ఇంకా నాజర్ , సుబ్బరాజు తదితరులు కూడా అద్భుతంగా చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు:

బాహుబలి టెక్నికల్ టీమ్ గురుంచి చెప్పేది ఏముంది, కీరవాణి తన మ్యూజిక్ తో మరోసారి మరిపించాడు, ఓవైపు ఎమోషనల్ సీన్స్.. మరో వైపు యుద్ధ సన్నివేశాలు.. మరోవైపు హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్.. అన్నింట్లోనూ కీరవాణి నేపథ్య సంగీతం పతాక స్థాయిలో సాగుతుంది. మరోసారి తన కెమెరా పనితనంతో సెంథిల్ కుమార్ తానేంటో రుజువు చేసాడు, తన ఆర్ట్ డైరెక్షన్ తో సోబు శిరిల్ ఆకట్టుకున్నాడు, అద్భుతమైన సెట్టింగ్ లు వేశారు.

విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రేక్షకులని నిరాశకి గురిచేశారనే చెప్పొచ్చు, ముఖ్యంగా మొదటి భాగంలో వీఎఫెక్స్ ఎఫెక్ట్స్ చూసే ఎక్కువమంది ప్రేక్షకులు సినిమాని ఆకాశానికి ఎత్తేసారు, ఆ అంచనాలని రెండవ భాగం అందుకోలేకపోయింది అని చెప్పొచ్చు, ఇక తొలి భాగంలో కేవలం విజువల్ గ్రాండియర్ తో మాయ చేసేశాడు.. కథను సరిగా చెప్పలేకపోయాడని కొంత మేర విమర్శలెదుర్కొన్న రాజమౌళి.. ఈసారి ఆ విషయం మీదే ఎక్కువ దృష్టిపెట్టాడు. అసలు కథను ఆసక్తికరంగా.. బిగువుతో చెప్పడంలో రాజమౌళి విజయవంతం అయ్యాడు. ఎమోషనల్ డ్రామాను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎప్పట్లాగే హీరో ఎలివేషన్ సీన్స్ లో రాజమౌళి తనకు తానే సాటి అనిపించాడు.

ప్లస్ పాయింట్స్ :

  • కథ, కథనం
  • ప్రభాస్ , అనుష్క ,రానా, రమ్యకృష్ణల నటన
  • బలమైన పాత్రలు
  • ఎమోషనల్ సీన్లు
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • కొన్నిచోట్ల ముందే ఉహించదగ్గ కథనం

పంచ్ లైన్: బలి బలి బలిరా బలి సాహోరే.. బాహుబలీ.! బాక్స్ ఆఫీస్ మొత్తం బలి..!

Comments

comments