బాహుబలి ఖాతాలో మరో రికార్డు..!

Author:

కలెక్షన్స్ తో ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించిన బాహుబలి సినిమా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 2015 వ సంవత్సరం నంది అవార్డులలో 14 నందులను గెలుచుకొని రికార్డు సృష్టించింది, రాజమౌళి అండ్ టీమ్ కష్టానికి, ప్రభాస్ మరియు ఇతర నటులు చూపించిన డెడికేషన్ కి ఈ నందులు తార్కాణాలని అందరు బాహుబలి టీమ్ ని మరో సారి అభినందిస్తున్నారు.

బాహుబలి బాహుబలి నంది అవార్డులు

బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు సినిమాలు కలిపి కేవలం తెలుగు వెర్షన్ కే దాదాపు రూ.490 కోట్లు వసూలయ్యాయి, ఇలా అన్ని భాషల వెర్షన్ లలోను అనేక రికార్డులను బాహుబలి తిరగరాసింది, బాహుబలి సినిమాకి, ప్రభాస్ నటనకి దేశమంతా ఫిదా అయిపోయిన సంగతి మనకి తెలిసిందే, అయితే మరోసారి బాహుబలి ది బిగినింగ్ సినిమా 14 బంగారు నందులను గెలుచుకొని మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

బాహుబలి ది బిగినింగ్ ని వరించిన నంది అవార్డులు:

 1. ఉత్తమ చిత్రం – బాహుబలి
 2. ఉత్తమ దర్శకుడు- ఎస్. ఎస్. రాజమౌళి
 3. ఉత్తమ విలన్- రానా (బాహుబలి)
 4. ఉత్తమ సహాయనటి- రమ్యకృష్ణ (బాహుబలి)
 5. ఉత్తమ సినిమాటోగ్రాఫర్- కె.కె. సెంథిల్ కుమార్ (బాహుబలి)
 6. ఉత్తమ సంగీత దర్శకుడు- ఎమ్. ఎమ్. కీరవాణి (బాహుబలి)
 7. ఉత్తమ మేల్ సింగర్- ఎమ్. ఎమ్. కీరవాణి (ఎవ్వడంట-బాహుబలి)
 8. ఉత్తమ చిత్రకారుడు- సాబు సిరిల్ (బాహుబలి)
 9. ఉత్తమ కొరియోగ్రాఫర్- ప్రేమ రక్షిత్ (ఇరుక్కుపో-బాహుబలి)
 10. ఉత్తమ ఆడియోగ్రాఫర్- పి.ఎమ్. సతీష్ (బాహుబలి)
 11. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్- రమా రాజమౌళి (బాహుబలి)
 12. ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్- రవిశంకర్ (సత్యరాజ్- కట్టప్ప)
 13. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్- వి. శ్రీనివాస్ మోహన్ (బాహుబలి)
 14. ఉత్తమ ఫైట్ మాస్టర్ – పీటర్ హెయిన్స్

(Visited 267 times, 286 visits today)