Home / Entertainment / బాహుబలి అవార్డ్స్ లోను రికార్డ్స్ బద్దలు కొట్టనుంద?

బాహుబలి అవార్డ్స్ లోను రికార్డ్స్ బద్దలు కొట్టనుంద?

Author:

Rana Daggubati

బాహుబలి చిత్రం తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా వసూళ్లు సాధించింది. అయితే ఇక్ నుండి అవర్డ్స్ లలో కూడా రికర్డ్స్ బద్దలు కొట్టనుంది ఇప్పుడు మొదటి అవడ్స్ గా సౌతిండియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఏసియావిజన్ మూవీ అవార్డ్స్-2015 లకు బాహుబలి సినిమాలో భల్లాలదేవుడుగా మెప్పించిన రానా ఎంపికయ్యాడు. తెలుగు విభాగంలో పెర్ఫార్మెర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రానా దక్కించుకున్నారు. డిసెంబర్ 2న దుబాయ్ లో జరిగే వేడుకలో రానా ఈ అవార్డు అందుకోబోతున్నాడు. ఏసియావిజన్ మూవీ అవార్డ్స్ ఇది 10 ఎడిషన్. ఈ నేపథ్యంలో గ్రాండ్ గా అవార్డు కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బాహుబలి-ది బిగినింగ్’ భారీ విజయం సాధించడంతో పార్ట్-2 షూటింగుకు మరింత ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు రాజమౌళి అండ్ టీం. బాహుబలి చిత్రం తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా వసూళ్లు సాధించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 14న ఫార్మల్ గా పూజా కార్యక్రమాలతో ‘బాహుబలి-2’ షూటింగ్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలుస్తోంది. ఈ మేరకు పండితులు ముహూర్తం ఖరారు చేసారు. సెకండ్ పార్ట్ కోసం దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తారని తెలుస్తోంది. మొత్తం 170 నుండి 190 వర్కింగ్ డేస్ లలో షూటింగ్ పార్ట్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేసారు. యూనిట్ సభ్యులు ప్రతి షెడ్యూల్ కు మధ్య 10 నుండి 20 రోజులు బ్రేక్ తీసుకుంటారని సమాచారం. ప్రభాస్ మొత్తం 10 నెలల పాటు ఈ షూటింగులో గడపనున్నాడు. 2016 సంవత్సరం మొత్తం ‘బాహుబలి-2’ షూటింగులో గడిచిపోనున్న నేపథ్యంలో ప్రభాస్ ఇతర సినిమాలేవీ కమిట్ కావడం లేదు.

‘బాహుబలి-1’ భారీ విజయం సాధించడంతో పార్ట్-2పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈనేపథ్యంలో రాజమౌళి రెండో పార్టును మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాహుబలి 1 కంటే రెండో పార్టు కోసం బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారట. సెకండ్ పార్టులో కొన్ని అడిషనల్ క్యారెక్టర్లు కూడా క్రియేట్ చేసినట్లు సమాచారం. సౌత్ తో పాటు బాలీవుడ్ నుండి పలువురు స్టార్స్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది. ‘బాహుబలి-2’ను 2016లో విడుదల చేస్తామని రాజమౌళి అండ్ టీం గతంలో ప్రకటించినప్పటికీ అనుకున్న సమయానికి వచ్చే ఏడాది సినిమా రావడం లేదని తేలి పోయింది. ‘బాహుబలి-2’ విడుదల సాధ్యమయ్యేది కేవలం 2017లోనే అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

(Visited 85 times, 9 visits today)