Home / Political / కొత్త హంగులతో మన ముందుకు మరొసారి రాబోతున్న బజాజ్ చేతక్ స్కూటర్లు?

కొత్త హంగులతో మన ముందుకు మరొసారి రాబోతున్న బజాజ్ చేతక్ స్కూటర్లు?

Author:

మన దేశంలో బైకుల విప్లవం రాకముందు బజాజ్ చేతక్ స్కూటర్ల యొక్క గొప్పతనం అందరికి తెలుసు.అప్పట్లో ఈ స్కూటర్ కూడా స్టేటస్ సింబల్ లాగా ఉండేది. రాను రాను అందరూ బైకులు కొనడం మొదలుపెట్టడం మరియు బజాజ్ వారు కూడా స్కూటర్లకు ఎటువంటి కొత్త మార్పులు చేయకపోవడంతో 2006 సంవత్సరంలో వాటి నిర్మాణాన్ని ఆపేసి బజాజ్ బైకులు తయారు చేయడం మొదలుపెట్టారు. కాని చేతక్ బండి వాడిన వారికి అది ఎంత స్పెషలో చెప్పడం కష్టం, ఇప్పటికి కొందరు తమ పాత చేతక్ ను గుర్తుగా దాచుకున్నారు. అలాంటి చేతక్ ప్రేమికుల కోసమే ఈ వార్త.

bajaj-chetak-scooter

బైకుల రంగంలో దూసుకుపోతున్న బజాజ్ వారు తమ మార్కెట్ ని ఇంకా పెంచుకోవడం కోసం చాల మందికి ఇష్టమైన చేతక్ స్కూటర్ ని మళ్ళీ తయారు చేయనున్నారని తెలుస్తుంది. పది సంవత్సరాల తరువాత సరికొత్త హంగులతో ఈ స్కూటర్లను తయారు చేయనున్నారు. ఇప్పటికే వెస్పా కంపనీ వివిధ స్కూటర్లను తయారుచేసి మార్కెట్లోకి వదిలింది. ఇక వాటికి పోటీగా త్వరలోనే బజాజ్ చేతక్ స్కూటర్లు దూసుకుపోనున్నాయని ఇండియాటుడే వారు ఒక కధనాన్ని ప్రచురించారు. సో ఇంతకుముందు కన్న అత్యున్నత టెక్నాలజి  ఫీచర్లతో రానున్న చేతక్ స్కూటర్ల కోసం వేచి చూడండి.

(Visited 1,811 times, 28 visits today)