Home / Entertainment / అద్బుతం అనిపించేలా బాజీరావ్ మస్తానీ ట్రైలర్.

అద్బుతం అనిపించేలా బాజీరావ్ మస్తానీ ట్రైలర్.

Author:


బాజీరావ్ మస్తానీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించబోయే ఈ చిత్రం పై బాలీవుడ్లో నే కాదు మిగతా ఇండస్ట్రీలలోనూ ఈ మధ్య చర్చ ఎక్కువగానే జరుగుతోంది. 1720లో నాలుగవ మరాఠా చత్రపతి షాహుకు ప్రధానిగా సేవలందించిన బాజీరావు పీష్వా, ఆయన ప్రేయసి మస్తానీ జీవిత, ప్రేమకథా నేపథ్యంగా నిర్మించే ఈ చిత్రం అందరి చూపులనీ తన వైపుతిప్పుకుంటోంది. దాదాపు రూ. 120 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా మరో సంచలన సినిమా ఔతుందనటం లో సందేహం లేదు. బాలీవుడ్ బాహుబలి సినిమాగా రాబోతున్న భాజీరావ్ మస్తానీ రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ నుండి భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది.ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా రణవీర్ దీపిక పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న సంగతి అందరికి తెలిసిందే. మీడియా ముందు కూడా వీరు చాలా సార్లు కంటపడ్డారు. రామ్ లీలాకు ముందు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేసిన రణవీర్ ఆ సినిమా నుండి దీపికానే పట్టుకున్నాడు. దీపికా కూడా రణవీర్ తో సన్నిహితంగా ఉంటుంది.

సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం లోనే వచ్చిన రాం లీలా సినిమాలో కూడా హాట్ హాట్ సీన్లలో నటించి ఆడియెన్స్ ని అలరించిన ఈ ఇద్దరు. ఇప్పుడు బాజీరావ్ మస్తానీ లో కూడా అదే విధంగా అలరించనున్నారన్న మాట. ‘భాజీరావ్ మస్తానీ” ఇప్పుడు విడుదలకు సిద్దమౌతోన్న సినిమాల్లో క్రేజీయెస్ట్ లిస్ట్ లో ఉన్న సినిమా ఇది. భారీ హ౦గులతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ సినిమా షారుఖ్ ఖాన్ నటిస్తున్న “దిల్ వాలే” కి పోటిగా అదే రోజు విడుదల కాబోతు౦ది, దా౦తో సినిమాను సేఫ్ సైడ్ లో నడపడానికి దర్శకుడు స౦జయ్ లీలా భన్సాలీ కూడా రన్ వీర్ సి౦గ్ ,దీపిక ల మధ్య మ౦చి హాట్ హాట్ సన్నివేశాలను ఓ రొమా౦టిక్ సా౦గ్ ను ప్లాన్ చేశాడ౦ట. ఇవి అభిమానులను గిలిగింతలు పెట్టడమే కాకు౦డా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాయని భన్సాలీ నమ్మక౦. దాదాపు120 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది కూడా బాహుబలి లానే పీరియాడికల్ సినిమా….

నిన్ననే రిలీజైన ట్రైలర్ చూస్తే కళ్ళు తిరిగిపోవటం ఖాయం. అద్బుతమైన పోరాట సన్నివేశాలను అత్యద్బుతంగా తెరకెక్కించినట్టు అర్థమైపోతోంది. భాజీరావ్ భార్యా ప్రియురాలు గా నటిస్తున్న ప్రియాంక, దీపిక పదుకుణే లని ఇంతవరకూ ఎన్నడూ లేనంత అందం గా చూపించి తనకు తానే సాటి అనిపించుకున్నాడు సంజయ్…. ఇక ట్రైలర్ చివరలో యుద్దభూమిలో గాయాలతో కాలిలో దిగబడ్డ బాణం తో ఉన్న రణవీర్ సింగ్ ని చూస్తే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నయ్… మొత్తానికి మరో పిరియాడికల్ బ్లాక్ బస్టర్ కోసం ప్రేక్షకులు సిద్దంగా ఉండాల్సిందే అనిపించేలా ఉన్న ట్రైలర్ ని ఓ సారి చూడండి…

(Visited 176 times, 30 visits today)