Home / Entertainment / సావిత్రి పాటలు వినిపించిన బాలయ్య.

సావిత్రి పాటలు వినిపించిన బాలయ్య.

Author:

Savithri Movie Audio Launch Stills

నారా రోహిత్‌ ఇప్పుడు మనోడు మంచి జోరు మీద ఉన్నాడు. తెలుగు పరిశ్రమలో ఎవరులేనంత బిజిగా ఉన్నాడు. నిన్న రాత్రి రోహిత్, నందిత జంటగా రూపొందుతున్న ‘సావిత్రి’ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. కృష్ణ చైతన్య సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు…

బాలకృష్ణ మాట్లాడుతూ…సావిత్రి ఆడియో రీలీజ్ అనంతరం మాట్లాడుతూ సినిమా మంచి విజయం సాధించాలని కోరుతూ సావిత్రి టీమ్‌కు బాలయ్య ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇక హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా ‘బాణం’ అప్పట్నుంచీ బాలకృష్ణ గారు ఇస్తూ వస్తోన్న సపోర్ట్ మరచిపోలేనని తెలిపారు.ఈ సినిమాలో రోహిత్ ఒక పాట పాడిన సంగతి మనకు తెలిసిందే, పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై విబి. రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు.

(Visited 228 times, 48 visits today)