EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

బాలాపూర్ ల‌డ్డూ… ఎందుకంత ప్ర‌త్యేక‌తంటే?

Author:

వినాయక చవితి వచ్చిందంటే చాలు..అందరి చూపంతా ఒకటి ఖైరతాబాద్ గణేష్ ఎత్తుపై, మరొకటి బాలాపూర్ లడ్డు వేలం పై ఆసక్తి చూపిస్తుంటారంటే అతిశోయోక్తి కాదేమో. ఒకప్పుడు ఎవరికీ తెలియని ఈ మారుమూల గ్రామమైన బాలాపూర్ ఇప్పుడు లడ్డు వేలం పాటతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఏటికేడు వేలంలో లడ్డు ధర భారీ ఎత్తున పెరుగుతూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఇంతింతై వటుడింతై అన్నట్టు ఇరువై ఏళ్ళ క్రితం కేవలం రూ.450 తో ప్రారంభమైన ఈ లడ్డు వేలం గత ఏడాది ఏకంగా రూ.14.65 లక్షలకు చేరింది. బాలాపూర్ లడ్డుతో అన్ని విధాలా అదృష్టం కలసివస్తుందని నమ్మకంగా మారింది. ఈ ఏడాది కూడా అడ్డు వేలం ఇంతకు పోతుందో అని అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

ఏంటి ప్రత్యేకత?
బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ 1980 లో ప్రారంభమైనది కానీ లడ్డు వేలంపాటను మాత్రం 1994 నుండి నిర్వహిస్తున్నారు. 1994 లో వ్యవసాయదారుడైన కొలను మోహన్ రెడ్డి రూ. 450 లతో వేలం పాటలో లడ్డును దక్కించుకున్నాడు. ఆ ఏడాది ఆర్థికంగా కలసిరావండంతో 1995 లోనే ఏకంగా రూ. 44,500 లకు దక్కించుకున్నాడు. అక్కడి నుండి లడ్డు ధర ఏటికేడు పెరుగుతుంది. లడ్డు ఎంతో మహిమలు కలదని, అంత మంచే జరుగుతుందనే నమ్మకంతో బాలాపూర్ లడ్డుకి రానురాను గిరాకీ పెరుగుతూ వస్తువుంది.

balapur-laddu-auction

ఏ ఏడాది ఎంత ?
1996, 97లో కొలన్ కృష్ణారెడ్డి, 98 లో కొలన్ మోహన్ రెడ్డి, 99లో కల్లెం ప్రతాప్ రెడ్డి, 2వేల సంవత్సరంలో కల్లెం అంజిరెడ్డి, 2001లో జి రంఘునందన్ చారి, 2002లో కందాడ మాధవ రెడ్డి, 2003లో చిగురింత బాల్ రెడ్డి, 2004లో కొలన్ మోహన్ రెడ్డి, 2005లో ఇబ్రహమ్ శేఖర్, 2006లో చిగురింత తిరుపతి రెడ్డి, 2007లో రఘునందన్ చారి, 2008లో కొలన్ మోహన్ రెడ్డి, 2009లో సరిత, 2010లో కొడాలి శ్రీధర్ బాబు, 2011లో కొలన్ ఫ్యామిలీ, 2012లో గోవర్థన్ రెడ్డి, 2013లో తీగల కృష్ణారెడ్డి, 2014లో ఎస్ జయింద్ రెడ్డి.. 9 లక్షల యాభై వేలకి లడ్డూని దక్కించుకుకోగా 2015లో రికార్డ్ స్థాయిలో కళ్లెం మదన్ మోహన్ రెడ్డి రూ. 10.32 లక్షలకు అడ్డూను సొంతం చేసుకున్నారు.  2016లో మేడ్చల్ కు చెందిన స్కైలాబ్ రెడ్డి రికార్డుస్థాయిలో 14.65 ల‌క్ష‌ల‌ రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. ఇక ఈ ఏడాది జూబ్లీహిల్స్ కు చెందిన నాగం తిరుప‌తిరెడ్డి ఏకంగా రూ.15.60ల‌క్ష‌లకు ల‌డ్డూను సొంతం చేసుకున్నారు.

బాలాపూర్ ల‌డ్డూ... ఎందుకంత ప్ర‌త్యేక‌తంటే?

వేలం విధానం.
బాలాపూర్ లడ్డు వేలం రోజు పండగను తలపించేలా ఉంటుంది. ఉదయం 4 గంటల నుండే కోలాహల వాతావరణం నెలకొని ఉంటుంది. వినాయక చవితి మొదట రోజు నుండి లడ్డు కోసం పోటీపడుతున్న వారి దరఖాస్తులను ప్రారంభించి నిమజ్జనం నాడు ఉదయం 7 గంటలకు అప్లికేషన్లను ముగించేస్తారు. వేలం మొదట రూ. 1,116 లతో ప్రారంభమై మెల్లమెల్లగా పెరుగుపోతూ చివరికి భారీ మొత్తంలో పాడి బాలాపూర్ లడ్డును దక్కించుకుంటారు. అన్నట్టు వేలంలో లడ్డును దక్కించుకున్న వారు బాండ్ పై సంతకం చేసి వచ్చే ఏడాది వేలం పాటనాడు డబ్బులు ఇవ్వవలసి ఉంటుంది.

balapur-laddu-auction-2

వేలం డబ్బులు అభివృద్ధి కార్యక్రమాలకు…
గణేష్ వేలం ద్వారా వచ్చిన డబ్బు బాలాపూర్ ఉత్సవ కమిటీ గ్రామాల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. అప్పటికి గ్రామంలో పాఠశాలలు, రోడ్లు,దేవాలయాలు నిర్మించింది.

(Visited 2,164 times, 209 visits today)

Comments

comments