EDITION English తెలుగు
ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?   ఆరోగ్యం,భోజ‌నం, చ‌దువు, అంతా…..ఈ వాత్స‌ల్యం సంస్థే అండ‌గా నిల‌బ‌డ‌తుది   'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌

బాలయ్య వారసుడెవరు ?

Author:
విశ్వ విఖ్యాత నటసార్వభౌమ.. ఈ బిరుదు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడు.. దటీజ్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ నందమూరి తారక రామారావు. ఆయన తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలిగిపోయిన మహానటుడు. తెలుగు సినిమాలకే వన్నె తెచ్చిన నటుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన వేసిన పాత్రలకు ఆయనకు ఆయనే సాటి మరెవరూ లేరు పోటీ అన్నరీతిలో రికార్డ్స్, అవార్డ్స్, రివార్డ్స్ క్రియేట్ చేసారు. పౌరాణిక,జానపద,కుటుంబ తరహా ఏ పాత్రలకైనా ఆయన చేసిని న్యాయం మరెవరూ చేయలేరేమో అని పించేది అందుకే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీఆర్. అంత గొప్ప నటుడు కాబట్టే నటన నుంచి పాలిటిక్స్ కి ఎంట్రీ ఇచ్చినా జనాలు బ్రహ్మరథం పట్టి సీ ఎం ని చేసారు. తమ గుండెల్లో శాశ్వతంగా  గుడి కట్టారు.
ఇక ఆయన వారసులుగా వెండితెరకు పరిచయం హరికృష్ణ, బాలకృష్ణ ల్లో బాలకృష్ణ మంచి మాస్ కథానాయకుడిగా, క్రౌడ్ పుల్లర్ గా పేరు తెచ్చకున్నారు ఈయన కూడా పౌరాణిక, జానపద,సాంఘిక చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక ఫ్యాక్షన్ సినిమాలతో ప్రజల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించారు బాలయ్య. ఈయన తర్వాత జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లు మంచి హీరోలుగా గుర్తింపు తెచ్చకున్నారు. ఇక ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి మరో నట వారసుడి అరంగ్రేటానికి రంగం సిద్ధమైంది. బాలకృష్ణ ఏకైక కుమారుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశానికి డేట్‌ ఫైనల్‌ అయ్యిందని టాలీవుడ్ టాక్.
ఇప్పటి వరకు బాలకృష్ణ తన తనయున్ని సినిమారంగ ప్రవేశం చేయిస్తానని చెప్పినప్పటికీ వయసు అడ్డు రావడంతో కాస్త ఆలస్యం చేశారు.  సెప్టెంబర్ 6వ తేదీ నాటికి మోక్షజ్ఞ 21 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నాడు. మోక్షజ్ఞ పుట్టిన రోజునే తన సినీ ఎంట్రీ డేట్‌ అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని బాలకృష్ణ సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యే గా నెగ్గి రాజకీయ బాధ్యతలు తీసుకున్నాడు..ఇక రాజకీయ విషయాల్లో ఎక్కువ చొరవ, దూకుడు చూపాలి కాబట్టి తన తనయున్ని సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పిస్తే ఓ పనై పోతుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కుమారుడు ఎంట్రీ తర్వాతే తన వందో చిత్రం గురించి ఆలోచించాలని  కూడా బాలయ్య ఫిక్స్‌ అయ్యాడట. ప్రస్తుతం బాలయ్య తన కాంసంట్రేషన్‌ను తనయుడి ఎంట్రీపై పెట్టాడట. బోయపాటి శ్రీను, కొరటాల శివల్లో ఒకరు మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేసే అవకాశముందని తెలుస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరు దర్శకత్వం వహించినా మోక్షజ్ఞ పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలుంటాయి. మరి నందమూరి నటసింహం బాలకృష్ణ తన కుమారుడిని ఏ దర్శకుడి చేతుల్లో పెడతారో చూడాలి. మొత్తానికి నందమూరి వంశం నుంచి మూడో తరం కూడా ఎంట్రీ అయ్యినట్లే..
(Visited 26 times, 12 visits today)