Home / Latest Alajadi / బ్లేడుతో గొంతు కోసుకుంటానన్న బండ్ల గణేష్.. ఇప్పుడేమన్నారో తెలుసా? దానిపై వచ్చిన ట్రోల్ల్స్ ఇవే!

బ్లేడుతో గొంతు కోసుకుంటానన్న బండ్ల గణేష్.. ఇప్పుడేమన్నారో తెలుసా? దానిపై వచ్చిన ట్రోల్ల్స్ ఇవే!

Author:

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఒకవేళ కాంగ్రెస్ రాకపోతే 7’O Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా అంటూ ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఎంత ఓవర్ చేసారో కొత్తగా చెప్పనవసరంలేదు అనుకుంట. సోషల్ మీడియాలో ఆ వీడియో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి పెద్ద బొక్క పడింది. కేసీఆర్ దెబ్బకి సరిగ్గా ఇరవై సీట్లు కూడా దక్కలేదు. మరి ఇప్పుడు బండ్ల గణేష్ ఏమయ్యారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ వస్తున్నాయి. కొందరైతే బ్లేడ్ తీస్కొని బండ్ల గణేష్ వెళ్తాము అంటున్నారు. గతంలో కూడా ట్రంప్ నాకు తెలుసు అంటూ ఓవర్ చేసి..చివరికి ఏదో ఊర్కేనే అన్నా అంటూ కవర్ చేసాడు. మరి ఇప్పుడు ఎలా కవర్ చేసాడో తెలుసా.?

source

ఈ ఎన్నికల ఫలితాలపై బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల తీర్పును తాను గౌరవిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం, ఓటమిని అంగీకరిస్తున్నాం, గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అభినందనలు’’ అని ఆయన పేర్కొన్నారు.

బండ్ల గణేష్ ఎక్కడ? 7’O Clock బ్లేడ్ రెడీ అంటూ అంటూ ఓ రేంజ్ ఆటాడుకుంటున్నారు. వాస్తవానికి ఈ కామెంట్స్ చాలు.. బండ్ల గణేష్‌ పీక కోసుకోకుండానే పోవడానికి. అయితే ఆయనలో ఇంకా కమెడియన్ లక్షణాలు పోలేదు ఏదో అన్నారనే అనుకుందాం. దానికి నెటిజన్లు ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. ఆ ట్రోల్ల్స్ మీరే చూడండి!

(Visited 1 times, 11 visits today)