EDITION English తెలుగు
Video: సినిమాలకు ఇక సెలవు : పవన్ కల్యాణ్.   ఇక వాట్సాప్ లో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు.   హైదరాబాద్ నగరం అసలు పేరు ‘ చిచులం ’, ఇదే నిజమైన పేరు, ఈ విషయం చాలామందికి తెలియదని చారిత్రక పరిశోధకుడు పాండులింగారెడ్డి తెలిపారు.   స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.   షాకింగ్ న్యూస్: మూతపడిన ట్రంప్ ప్రభుత్వం, సంక్షోభంలో అమెరికా...!   Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.   క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి.. సాయం అందించాలనుకునే వారు అకౌంట్ నం. 80808080101026419 లో డబ్బులు వేయండి.   డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!   Video:స్కూల్ కి పది నిముషాలు లేట్ గా వచ్చాడని.. బాతులా నడిపించి..బలి తీసుకున్నారు.   పెద్ద పెద్ద క్రేన్లు ఆ హనుమాన్ విగ్రహాన్ని ఇంచుకూడా కదలించలేక పోయాయి.
Home / General / డబ్బుల కోసం కావాల‌నే రోడ్డుపై మేకులు వేసి, మీ బండ్ల‌కు పంక్చ‌ర్ చేస్తారు.

డబ్బుల కోసం కావాల‌నే రోడ్డుపై మేకులు వేసి, మీ బండ్ల‌కు పంక్చ‌ర్ చేస్తారు.

Author:

సైకిల్‌… కార్‌… లేదా బైక్ పై వెళ్తున్నారు. స‌డెన్‌గా టైర్ పంక్చ‌ర్ అయింది. అప్పుడు ఎవ‌రైనా ఏం చేస్తారు..? ద‌గ్గ‌ర్లో ఉన్న పంక్చ‌ర్ షాపుకు వెళ్లి పంక్చ‌ర్ వేయించుకుంటారు. అంత దూరం వాహ‌నాన్ని నెట్టాల్సి వ‌చ్చినందుకు విసుగు చెందుతారు. అయితే వాహ‌నాల టైర్లకు పంక్చ‌ర్ అయితే ఎవ‌రైనా ఇలాగే చేస్తారు. ఎన్నిసార్లు పంక్చ‌ర్ అయినా తిట్టుకుంటూ, కాళ్లు ఈడ్చుకుంటూ వెళ్లి పంక్చ‌ర్ వేయించుకుంటారు. కానీ ప‌దే ప‌దే అదే దారిలో పంక్చ‌ర్ ఎందుకు ప‌డుతుందో ఎవ‌రూ ఆలోచించరు. కానీ ఆ వ్య‌క్తి ఆలోచించాడు. అలా ఆలోచించాడు కాబ‌ట్టే దీని వెనుక ఉన్న పంక్చ‌ర్ మాఫియా గురించి జ‌నాల‌కు తెలిసింది.

అత‌ని పేరు బెనెడిక్ట్ జేబ‌కుమార్‌. వ‌య‌స్సు 42 ఏళ్లు. బెంగుళూరులో నివాసం ఉంటున్నాడు. 2011లో ఉద్యోగం నిమిత్తం అత‌ను బెంగుళూరుకు వ‌చ్చాడు. ఆ న‌గ‌రంలో బ‌న‌శంక‌రి అనే ప్రాంతంలో నివాసం ఉంటూ అక్క‌డికి 20 కిలోమీట‌ర్ల దూరంలోని ఎకో స్పేస్ అనే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే మొద‌ట్లో అత‌ను ఆఫీస్‌కు వెళ్లేట‌ప్పుడు రోజూ వాహ‌నానికి పంక్చ‌ర్‌లు ప‌డేవి. అది అత‌నికి అర్థం కాలేదు. రోజూ అదే దారిలో పంక్చ‌ర్‌లు ఎందుకు అవుతున్నాయో తెలిసేది కాదు. దీంతో రోజుకు క‌నీసం 3, 4 పంక్చ‌ర్‌లు వేయించేవాడు. అయితే ఒక రోజు మాత్రం అత‌నికి అస‌లు విష‌యం తెలిసింది. అదేమిటంటే… అత‌ని వాహ‌నానికి పంక్చ‌ర్ అయిన కొద్ది దూరంలోనే పంక్చ‌ర్ షాపులు ఉండేవి. దీంతో బెనెడిక్ట్‌కు అనుమానం వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అత‌ను ఏం చేయ‌డం మొద‌లు పెట్టాడంటే…

Benedict-Jebakumar-Puncture-Mafia

రోజూ ఉద‌యం 7 గంట‌ల‌కు ఆఫీసుకు వెళ్లేట‌ప్పుడు ఓ అయ‌స్కాంతం స‌హాయంతో రోడ్డుపై ఉండే మేకులను క‌లెక్ట్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఈ క్ర‌మంలో అత‌నికి రోజూ ఆ దారిలో కొన్ని వంద‌ల సంఖ్య‌లో మేకులు దొరికేవి. అది కూడా ఆ పంక్చ‌ర్ షాపుల‌కు ద‌గ్గ‌ర్లోనే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో బెనెడిక్ట్ ఈ స‌మాచారాన్ని పోలీసుల‌కు అందించ‌గా వారు అక్క‌డ ఉన్న పంక్చ‌ర్ షాపుల‌పై దాడి చేసి ఇద్దర్ని అరెస్టు చేశారు. వాహ‌నాల‌కు కావాల‌నే పంక్చర్లు ప‌డాల‌నే ఉద్దేశంతోనే వారు ఆ మేకుల‌ను ఆ దారిలో వేస్తున్నార‌ని తెలిసింది. దీంతో ఒక్క‌సారిగా ఈ విషయం వెలుగులోకి వ‌చ్చింది. అయితే బెనెడిక్ట్ అక్క‌డితో ఆగ‌లేదు. ఈ విష‌యం అంద‌రికీ తెలియాల‌నే ఉద్దేశంతో ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్‌ల‌లో ఎక్కువ‌గా ప్ర‌చారం చేయ‌సాగాడు. అయినా స‌ద‌రు వ్య‌క్తుల‌కు ఈ ప‌ని ఆప‌లేదు. దీంతో అత‌ను మ‌ళ్లీ మేకుల‌ను అయ‌స్కాంతంతో క‌లెక్ట్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. అలా అత‌ను ఈ నాలుగేళ్ల కాలంలో దాదాపుగా 70 కిలోల వ‌ర‌కు ఇనుప మేకుల‌ను క‌లెక్ట్ చేశాడు. ఓ వైపు ఆఫీస్‌, మ‌రో వైపు ఇనుప మేకులను ఏర‌డం. ఇదే అత‌ని రోజువారీ దిన‌చ‌ర్య‌. ఇంత చేసినా అక్క‌డి పంక్చ‌ర్ మాఫియా ఆగ‌డాలు ఇంకా ఆగ‌లేదు. అయితే ఇప్పుడు బెనెడిక్ట్ బ‌దిలీపై త‌మిళ‌నాడు వెళ్తున్నాడు. మ‌రి అక్క‌డ కూడా ఇలా క‌లెక్ట్ చేస్తాడా..? లేదా..? అనేది వేచి చూడాలి. అన్న‌ట్టు ఇంకో విష‌యం. అత‌ను క‌లెక్ట్ చేసిన ఆ 70 కిలోల ఇనుప మేకుల‌ను త‌న‌తో త‌మిళ‌నాడుకు తీసుకెళ్తున్నాడ‌ట‌..! ఏది ఏమైనా ఇలాంటి సామాజిక స్పృహ ఉన్న వ్య‌క్తులు మ‌న‌కు స‌మాజంలో అరుదుగా క‌నిపిస్తారు క‌దా..!

Comments

comments