EDITION English తెలుగు
కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?      "పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!
Home / health / వంట చేసే వాళ్లందరికీ ఉపయోగపడే టిప్స్

వంట చేసే వాళ్లందరికీ ఉపయోగపడే టిప్స్

Author:

ఈ రోజుల్లో స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ వంటలు చేసేస్తున్నారు. ఇంట్లో ఉండే గృహిణులు లేదా అద్దెకు ఉండే బాచిలర్లు అందరూ ప్రతి రోజు వంట చేసుకొని తినటం సాధారణం. కానీ, వంట వండేటప్పుడు చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి కూరలో ఉప్పు లేదా కారం ఎక్కువవడం జరుగుతుంది. కూరగాయలు కోసే సమయంలో కోసుకోవటం, వంట వండే సమయంలో చేతులు కాలటం ఇలాంటివి చాలానే సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా వంటగదిలో ఎదురయ్యే సమస్యలకి చాలా పరిష్కారాలు ఉన్నాయి అవ్వని ఇప్పుడు తెలుసుకుందాం.

basic-kitchen-safety-tips in telugu

 • వంటగదిలో బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్కా బాగా సహాయపడుతుంది. బిర్యానీ ఆకును పౌడర్‌గా చేసి బొద్దింకలు వచ్చే ప్రదేశంలో చల్లండి. ఆ వాసనకే బొద్దింకలు చనిపోతాయి.
 • వంటగదిలో చీమలు స్వైరవిహారం చేస్తున్నట్లైతే ఒక దోసకాయను ముక్కలుగా తరిగి చీమలు తిరిగే చోట ఉంచండి.
 • కూరల్లో మసాలా ఎక్కువైతే రెండు లేదా మూడు టమాటాలను ఉడికించి అందులో కలపండి. మసాలా ఘాటు తగ్గి మంచి రుచిగా వుంటుంది.
 • చెక్కతో చేసిన చెంచాలు, గరిటెలు వాసన వేస్తుంటే వాటిని వెనిగర్ కలిపిన నీటిలో ఉంచండి. కొద్ది సేపైన తర్వాత వాడుకోండి. వాసన రావు.
 • వంట చేసేటప్పుడు చేతులు మరకలు అవుతుంటే ఆలుగడ్డ ముక్కలతో రుద్ది కడుక్కోండి.
 • గులాబ్ జామ్ తయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీర్ కలపండి. అవి మృదువుగా రుచిగా ఉంటాయి.
 • గులాబ్ జాంలు చేసే సమయంలో కాసిని జీడిపప్పు కూడా గులాబ్ జామ్‌లు చేసే ఉండలకు కలిపారంటే, అవి మృదువుగా ఉంటాయి. మంచి రుచిగా ఉంటాయి.
 • చపాతీ పిండిని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళు లేదా కాస్త నూనె కలిపి గంటపాటు నానబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి.
 • చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు మృదువుగా ఎక్కువసేపు ఉంటాయి.
 • చపాతీలు వత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనెవేసి మడతలతో చేసి హాట్ ప్యాక్‌లో ఉంచితే 6నుండి7 గంటలపాటు మెత్తగా ఉంటాయి.
 • రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్త వాటిలా మెరిసిపోతాయి.
 • పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా తయ్యరైతే దానిమీద సబ్బునీళ్ళు పోసి సన్నటి సెగ మీద ఉంచి చల్లారాక రుద్దితే శుభ్రపడుతుంది.
 • పచ్చి బటానీలను ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి.
 • బియ్యం, తృణ ధాన్యాలను నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రేఖలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి.
 • కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలిపితే సరిపోతుంది.
 • దోశల పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండిని కలిపితే అవి రుచిగా వస్తాయి.
 • పచ్చి మిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి.

ఈ చిట్కాలు మీరు పాటించండి. ఈ సమాచారం షేర్ చేసి అందరికి తెలియజేయండి.

Comments

comments